ఇంటికీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ.. ఉపయోగాలేమిటంటే..?!!
Home Insurance | ఇంటి రక్షణకు.. ఇంట్లోని వస్తువుల భద్రతకు వివిధ రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
Home Insurance | ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి సొంతింటిని కట్టుకుంటారు.. లేదా కొనుక్కుంటారు. అలా సొంతం చేసుకున్న సొంతింటిని రక్షించుకోవడం కూడా ఒక బాధ్యతలే. ప్రక్రుతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు జరుగుతుంటాయి. వాటి నుంచి సెక్యూరిటీ కావాలంటే ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందే. వాటిల్లో పలు హోం ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్నాయి.
వైపరీత్యాల నుంచి దొంగతనం వరకు.. ఏం జరిగినా బీమా
ప్రకృతి విపత్తులు, దొంగతనం వంటి ఘటనలు జరిగినప్పుడు ఇల్లూ ఇంటిలో సామగ్రి, అందులో జీవించే వారికి కవరేజ్ లభిస్తుంది. కావాలని చేసే ప్రమాదాలకు మాత్రం ఇన్సూరెన్స్ లభించదు. అంతే కాదు పాలసీ తీసుకునే సమయానికే జరిగిన ప్రమాదాలకు కూడా ఈ బీమా కవరేజీ వర్తించదు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన వస్తువుల తయారీలో ఏదైనా లోపం ఉన్నా, ఇన్సూరెన్స్ కవరేజీ రాదు.
ఇంటి సామాగ్రి దెబ్బతిన్నా ఇన్సూరెన్స్
ఇంట్లో ఉన్న మెటీరియల్, పరికరాలు పోయినా, దెబ్బ తిన్నా ఇన్సూరెన్స్ కవరేజీ కల్పించేదే హోం కంటెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. జ్యువెల్లరీ, ఫ్రిజ్, టీవీ వంటి వస్తువులు పోయినా, దెబ్బ తిన్నా.. మార్కెట్లో ఉన్న రేటును బట్టి ఇన్సూరెన్స్ చెల్లిస్తారు.
చోరీ, ఉగ్రదాడుల్లో జరిగే నష్టానికి కవరేజీ
ఇల్లు దెబ్బతింటే నష్టానికి కవరేజీ కల్పించే ఇన్సూరెన్స్ స్ట్రక్చరల్ ఇన్సూరెన్స్. దొంగతనం, ఉగ్రదాడుల వంటి ఘటనల్లో ఇంటి నిర్మాణం దెబ్బ తింటే ఇన్సూరెన్స్ అంద చేస్తారు. రూఫ్ మొదలు నెల, కిచెన్.. ఎక్కడ దెబ్బ తిన్నా పరిహారం పొందొచ్చు. ఇక అద్దెకు ఉండే వారు కూడా టేనెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దాని వల్ల అలా అద్దెకు ఉన్న వారి హోం అప్లయెన్సెస్, జ్యువెల్లరీ, పరికరాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు బీమా కవరేజీ వస్తుంది. దొంగతనానికి గురైన వస్తువులకు మార్కెట్లో విలువను బట్టి బీమా కవరేజీ లభిస్తుంది.
ఓనర్లకు ఇలా బీమా పాలసీలు
ఇండ్లు అద్దెకిచ్చే ఓనర్లు తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీ ల్యాండ్ లార్డ్స్ బీమా.. వివిధ కారణాలతో అద్దె ఇన్ కం కోల్పోతే ఈ ఇన్సూరెన్స్ కవరేజీ వల్ల పరిహారం లభిస్తుంది. అద్దెకు ఉన్న వారి వల్ల నష్టం జరిగినా ఈ బీమా క్లయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఆయా బీమా సంస్థల నిబంధనలు బట్టి ఇది ఆధార పడి ఉంటుంది. ఇక వాతావరణ మార్పులు, విద్యుత్ షార్ట్ షర్క్యూట్, ఇతర అవాంఛనీయ ఘటనలతో అగ్ని ప్రమాదాలు సంభవించినా ప్రత్యేకంగా అగ్ని ప్రమాద బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
సమగ్ర పాలసీతోనే బెటర్ రిటర్న్స్
అయితే, ఏ బీమా పాలసీ తీసుకున్నా.. తీసుకోవాలనుకున్నా.. ఆయా పాలసీల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫీచర్లు, ప్రీమియం తదితర వివరాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వివిధ కంపెనీల పాలసీలు సరిపోల్చుకుని.. సమగ్రంగా ఉన్న పాలసీ ఎంచుకోవాలి. అలాగే ఎక్కువ మొత్తం కవరేజీ హామీ గల పాలసీ ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు సమగ్ర పాలసీ తీసుకుంటే బెటరని బీమా రంగ నిపుణులు అంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

