ITR Filing | ప్రతి ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి.. గత ఆర్థిక సంవత్సరా (2022-23)నికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. గతంతో పోలిస్తే ఐటీఆర్ ఫైలింగ్ చేయడం చాలా ఈజీ.. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కేంద్ర ఆర్థికశాఖ ఆధీనంలో పని చేస్తున్న ఆదాయం పన్ను విభాగం సొంత వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్సైట్ల నుంచి ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) లేదా ఆన్ లైన్ థర్డ్ పార్టీ వెబ్ సైట్లు.. క్లియర్ (గతంలో క్లియర్ టాక్స్), టాక్స్2 విన్, టాక్స్ బడ్డీ, క్వికో తదితర పోర్టల్స్ ఉన్నాయి.
ఆదాయం పన్ను విభాగం వెబ్సైట్ ద్వారా ఐటీఆర్ ఫైలింగ్ ఉచితం.. చార్టర్డ్ అకౌంటెంట్’ని సంప్రదించినా, థర్డ్ పార్టీ ఆన్ లైన్ వెబ్ సైట్ల ద్వారా ఫైల్ చేసినా చార్జీలు పే చేయాల్సింది. క్లియర్, టాక్స్బడ్డీ, టాక్స్2విన్, టాక్స్‌స్పానర్, మైఐటీరిటర్న్స్, క్వికో వంటి వెబ్సైట్లు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో పాపులర్.
ఎటువంటి సాయం లేకుండా ఐటీఆర్ ఫైలింగ్ చార్జీలు (ఈ నెల 19న వివిధ వెబ్సైట్లు చూపిన రేట్ల ఆధారంగా)
కేటగిరి ———– క్లియర్ ——— టాక్స్2విన్ —— టాక్స్‌స్పానర్— మైఐటీ రిటర్న్స్
వేతన జీవులు — రూ.299 -1098 — రూ.249-649 — రూ.399 — రూ.250-500
క్యాపిటల్ గెయిన్స్ —- రూ.1848 ——– రూ.249-649 —– — రూ.500-1000
వర్చువల్ డిజిటల్ అసెట్స్ – రూ.1949-2999 —— ———– ————–
విదేశీ ఆదాయం ———— రూ.2248 ——– ————— —————–
పలు వెబ్ సైట్లు గతంలో ఉచితంగా ఐటీఆర్ ఫైలింగ్ సేవలందించేవి. ఇటీవలి కాలంలో ఐటీఆర్-1, ఐటీఆర్-4 దాఖలు చేయడానికి చార్జీలు వసూలు చేస్తున్నాయి. మై ఐటీ రిటర్న్స్ వెబ్ సైట్ మాత్రం.. నిరుద్యోగులు, కుటుంబ పెన్షన్ ఆధారంగా జీవించే వితంతువులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఉచితంగా ఐటీఆర్ ఫైల్ చేస్తామని తెలిపింది.
వేతన జీవులు, ఇంటి ఆదాయం, ఇతర మార్గాల్లో ఆదాయం పొందే వారి ఆదాయాన్ని బట్టి క్లియర్ వెబ్సైట్ రూ.1399 నుంచి రూ.1949 వసూలు చేస్తే, మైఐటీ రిటర్న్ రూ.2000 నుంచి రూ.3500 వసూలు చేస్తున్నది. క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం కల వారి వద్ద క్లియర్ వెబ్ సైట్ రూ.3499 -రూ.5849, మై ఐటీ రిటర్న్ రూ.3500-5000 మధ్య వసూలు చేస్తున్నది.
సీఏ లేదా వెబ్సైట్ల నిర్వాహకులు ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు వీడియో కాల్ చేసినా ఫీజు చెల్లించాల్సిందే.
లైవ్ వీడియోకాల్ అండ్ ఐటీఆర్ ఫైలింగ్ కోసం క్లియర్ వెబ్ సైట్ రూ.2999-రూ.9999 మధ్య చార్జి విధిస్తుంది. సీఏ లేదా టాక్స్ ఆప్టిమైజర్ తో మూడు గంటలు మాట్లాడితే టాక్స్ స్పానర్ వెబ్ సైట్ రూ.7,999 చార్జీ వసూలు చేస్తుంది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్.. మీ ఐటీ రిటర్న్స్ అడిట్ చేయడానికి టాక్స్ స్పానర్ రూ.14,999 ఫీజు వడ్డిస్తుంది.