Volvo XC40 | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వొల్వో కార్ ఇండియా..దేశీయ మార్కెట్‌కు మరో ఈవీ మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్‌సీ 40 పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ఎక్స్‌షోరూం ధరను రూ.54.95 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 7.3 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 475 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.