Volvo EX30 EV | స్వీడన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తన స్మాల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ‘ఈఎక్స్30’ ని ఈ నెల ఏడో తేదీన భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ సంగతి వోల్వో తన అధికార వెబ్ సైట్, యూ-ట్యూబ్ చానెల్లో వెల్లడించింది. వోల్వో ఎస్ఎక్స్30 కారు అత్యంత గ్రీనెస్ట్ ఎస్యూవీ వేరియంట్ కానున్నది. పర్యావరణ పరంగా, ప్రయాణ పరంగానూ సేఫ్టీ కారుగా నిలువనున్నది.
సిగ్నేచర్ థోస్ హమ్మర్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, స్లీక్ ఫ్రంట్ ప్రొఫైల్ విత్ వెర్టికల్లీ ఎల్ఈడీ టెయిల్ టై్స్ కలిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో 480 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.ఈ కారు రెండు విభిన్న బ్యాటరీ ఆప్షన్లతో వస్తున్నది. ఎంట్రీ లెవల్ కారు 51 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, హై ఎండ్ వేరియంట్ 69కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటాయి. హై ఎండ్ ఎస్యూవీ కారు సింగిల్ చార్జింగ్‌తో 480 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.
5-సీట్ల ప్రీమియం క్యాబిన్, డ్యుయల్ టోన్ డాష్ బోర్డు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ విత్ రేర్ ఏసీ వెంట్స్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉంటాయి. ఇంకా డ్రైవర్, ప్రయాణికుల సేఫ్టీ కోసం పలు ఎయిర్ బ్యాగులతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) ఇస్తారు. ఈ కారు ధర రూ.40 లక్షల నుంచి మొదలవుతుందని భావిస్తున్నారు.