న్యూఢిల్లీ, డిసెంబర్ 14: వోల్వో కార్ ఇండియా కూడా ధరలను పెంచబోతున్నది. నూతన సంవత్సరం తొలి రోజు నుంచే అన్ని మాడళ్ల ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు తాజాగా వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం, విదేశీ మారకం రేట్లలో మార్పుల కారణంగా సంస్థపై పడుతున్న భారాన్ని స్వల్పంగా తగ్గించుకునే ఉద్దేశంలో భాగంగా వాహన ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు.