Volvo C40 Recharge | మార్కెట్లోకి వోల్వో సీ40 రీచార్జీ ఈవీ కారు.. ఇవీ డిటైల్స్..!
Volvo C40 Recharge | ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా.. దేశీయ మార్కెట్లోకి పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ కారు వోల్వో సీ40 రీచార్జీని ఆవిష్కరించింది. ఎనిమిది కలర్ ఆప్షన్లలో కారు లభిస్తుంది.
Volvo C40 Recharge | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘వోల్వో ఇండియా (Volvo India)’ భారత్ మార్కెట్లోకి శక్తిమంతమైన ఎలక్ట్రిక్ కారు ఎస్యూవీ ‘వోల్వో సీ40 రీచార్జీ (Volvo C40 Recharge) ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.61.25 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర) గా నిర్ణయించారు. సింగిల్ చార్జింగ్ పూర్తయితే 530 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. 27 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. భారత్ మార్కెట్లో వోల్వో ఇండియా ఆవిష్కరించిన రెండో ఎలక్ట్రిక్ కారు ‘వోల్వో సీ40 రీచార్జీ’. అధికారిక వెబ్సైట్లో కార్ల ప్రీబుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కొన్ని వారాల్లో కార్ల డెలివరీ మొదలు పెడతారు. హ్యుండాయ్ ఐకానిక్-5 తోపాటు కియా ఈవీ6, బీఎండబ్ల్యూ 14, వోల్వో ఎక్స్‌సీ 40 రీచార్జీ కార్లతో వోల్వో సీ40 రీచార్జి కారు పోటీ పడుతుంది.
గత జూన్ 14న వోల్వో సీ40 రీచార్జి ఈవీ కారును ఆవిష్కరించింది. ఎనిమిది కలర్ ఆప్షన్లు – బ్లాక్ స్టోన్, ఫ్యుషన్ రెడ్, థండర్ గ్రే, జోర్ బ్లూ, సిల్వర్ డౌన్, క్రిస్టల్ వైట్, సాగే గ్రీన్, ఓనీక్స్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. వోల్వో సీ40 రీచార్జి కారు ఇండియన్ వర్షన్ ట్విన్ మోటార్స్‌తో వస్తుంది. ట్విన్ మోటార్ 408 పీఎస్ విద్యుత్, 660 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్ కారు 4.7 సెకన్లలో 100 కి.మీ. వేగం అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 180 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.
గ్లోబల్ మార్కెట్లో రేర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. సింగిల్ మోటార్ గరిష్టంగా 235 బీహెచ్పీ విద్యుత్, 420 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ కారు 7.4 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.78 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తున్న వోల్వో సీ40 రీచార్జీ ఈవీ కారు 150 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్ సాయంతో 27 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చార్జింగ్ అవుతుంది. 11 కిలోవాట్ల లెవల్-2 చార్జర్ సాయంతో ఫుల్ చార్జింగ్ కావడానికి 7-8 గంటల టైం పడుతుంది.
వోల్వో సీ40 రీచార్జి ఈవీ కారు ఆకర్షణీయంగానూ, అధునాతనంగానూ ఉంటుంది. ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ ల్యామప్స్, 19-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, డోర్ మిర్రర్ కవర్స్, హై గ్లాస్ బ్లాక్ సైడ్ విండో ట్రిమ్, లామినేటెడ్ పనోరమిక్ రూఫ్ విత్ ప్రొటెక్టివ్ యూవీ కోటింగ్, ప్రొటెక్టివ్ క్యాప్ కిట్, మ్యాట్లె టెక్ గ్రే, టింటెడ్ రేర్ విండో తదితర ఫీచర్లు ఉంటాయి.
క్యాబిన్ ఎయిర్ క్లీనర్, యాప్ రిమోట్ సర్వీస్, పిక్సెల్ లైట్స్, హార్మన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, 60:40 ఫోల్డబుల్ రేర్ సీట్లు, 12-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 9-అంగుళాల సెంటర్ డిస్ ప్లేతో కూడిన డాష్ బోర్డ్, గగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ప్లే స్టోర్ తోపాటు ఇన్ బిల్ట్ గూగుల్ యాప్స్ ఉంటాయి. 360 డిగ్రీ పార్కింగ్ వ్యూ, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (బీఎల్ఐఎస్), క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ తదితర సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

