Vivo X Series | 14న గ్లోబల్ మార్కెట్లో వివో ఎక్స్100.. వివో ఎక్స్100 ప్రో ఫోన్ల ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్
Vivo X Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు.. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ఫోన్లను ఈ నెల 14న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
Vivo X Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లను ఈ నెల 14న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది. ఇప్పటికే చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీ చిప్ సెట్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్నది వెల్లడించాల్సి ఉంది. 120 వాట్ల చార్జింగ్ మద్దతుతో వివో ఎక్స్100, 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో వివో ఎక్స్100 ప్రో వస్తున్నాయి.
గత నెలలో ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆర్జిన్ ఓఎస్4 వర్షన్‌పై చైనా మార్కెట్లో వివో ఎక్స్100, వివో ఎక్స్ 100 ప్రో ఫోన్లు లభిస్తున్నాయి. చెన్ యీ బ్లాక్, స్టార్ ట్రయల్ బ్లూ, సన్ సెట్ ఆరేంజ్, వైట్ మూన్ లైట్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ 8టీ ఎల్టీపీఓ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్ సెట్ కలిగి ఉన్నాయి.
వివో ఎక్స్100 ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ ఐఎంఎక్స్920 వీసీఎక్స్ బయోనిక్ మెయిన్ కెమెరా, 64-మెగా పిక్సెల్ జీస్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాతో వస్తుండగా, వివో ఎక్స్100 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్989 1-అంగుళం టైప్ సెన్సర్, 50-మెగా పిక్సెల్ జీస్ ఏపీఓ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా కలిగి ఉంటాయి. రెండు ఫోన్లలోనూ 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి.
వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ఫోన్లు రెండూ ఒక టిగా బైట్ ఇన్ బిల్ట్ స్టోరేజీ, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంటాయి. వివో ఎక్స్ 100 ఫోన్ 120 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, వివో ఎక్స్100 ప్రో ఫోన్ 100 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

