Vivo X100 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 13న చైనా మార్కెట్లో ఆవిష్కరిస్తారు. తదుపరి భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేస్తారు. వివో ఎక్స్100 (Vivo X100)తోపాటు వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro), వివో వాచ్3 (Vivo Watch3) కూడా ఆవిష్కరిస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీ (Media Tek Dimensity 9300 SoC) చిప్ సెట్, జెయిస్ బ్రాండ్ (Zeiss) కెమెరాలు, వీ2 ఇమేజింగ్ చిప్ (V2 Imaging Chip)తో మార్కెట్లోకి వస్తున్నట్లు ధ్రువీకరించారు.
వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్, ఆరెంజ్ కలర్స్‌లో వస్తుందని తెలుస్తున్నది. కెమెరా ఐలాండ్‌పై ఎల్ఈడీ ఫ్లాష్ ఏర్పాటు చేస్తారు. 1-అంగుళం మెయిన్ కెమెరా ఉంటుంది.వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) ఫోన్ 6.78-అంగుళాల (1260×2800 పిక్సెల్స్) అమోలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ ప్లే కలిగి ఉంటది. 50 వాట్ల వైర్ లెస్, 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4870 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.