Vivo X Fold 3 | దేశీ మార్కెట్లో త్వరలో వివో ఎక్స్ ఫోల్డ్ 3 లాంఛ్
Vivo X Fold 3 | దేశీ మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3ని వివో త్వరలో లాంఛ్ చేయనుంది. అత్యంత ధిన్ డిజైన్‌తో రానున్న ఈ ఫోల్డబుల్ ఫోన్ శక్తివంతమైన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
Vivo X Fold 3 | దేశీ మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3ని వివో త్వరలో లాంఛ్ చేయనుంది. అత్యంత ధిన్ డిజైన్‌తో రానున్న ఈ ఫోల్డబుల్ ఫోన్ శక్తివంతమైన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. భారత్‌లో ఇప్పటికే వన్‌ప్లస్ ఓపెన్, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 పేరుతో రెండు ప్రముఖ ఫోల్డబుల్ డివైజ్‌లు ఉండగా వివో ఎక్స్ ఫోల్డ్ 3 ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ దిగ్గజ బ్రాండ్లకు వివో ఫోల్డబుల్ ఎలాంటి పోటీ ఇస్తుందనేది ఉత్కంఠ రేపుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఎక్స్ ఫోల్డ్ 2 12.9 ఎంఎం స్లీక్తో సన్నటి ఫోన్‌గా మార్కెట్లోకి రావడంతో దాని కొనసాగింపుగా వస్తున్న వివో ఎక్స్ ఫోల్డ్ 3 మరింత థిన్‌గా ఉండనుంది. ఇక వివో చైనా మార్కెట్లో వివో ఎక్స్ ఫోల్డ్ 3, ఎక్స్ ఫోల్డ్ 3 ప్రొను లాంఛ్ చేయడంతో స్పెసిఫికేషన్స్‌పై క్లారిటీ నెలకొంది. వివో ఎక్స్ ఫోల్డ్ 3, ఫోల్డ్ 3 ప్రొ ఒకే ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగిఉంటాయి. ఎక్స్ ఫోల్డ్ 3 ప్రొ ఇంటిగ్రేటెడ్ అల్ట్రా-సోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫీచర్‌ను కలిగిఉంది. ఇక డిజైన్ విషయానికి వస్తే వివో ఎక్స్ ఫోల్డ్ 3 సిరీస్‌లో రెండు వేరియంట్లలో స్టాండర్డ్ వేరియంట్ ఫోల్డ్ చేసినప్పుడు కేవలం 4.65 ఎంఎంతో థిన్నెస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌గా చెబుతున్నారు.
ఇది ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ కంటే బరువు తక్కువగా ఉంటుంది. కెమెరా ఫీచర్లను పరిశీలిస్తే వివో ఎక్స్ ఫోల్డ్ 3 వెనుకభాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. 50 ఎంపీ మెయిన్ కెమెరా, వైడ్‌యాంగిల్ షాట్స్ కోసం మరో 50 ఎంపీ కెమెరా, పోర్ట్రయిట్ షాట్స్ కోసం 50 ఎంపీ రెగ్యులర్ వెర్షన్ కమెరాలున్నాయి. ఎక్స్ ఫోల్డ్ 3 5500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుండగా, ఫోల్డ్ 3 ప్రొ 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
Read More :
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

