హైదరాబాద్, డిసెంబర్ 30: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల రిటైల్ సంస్థ విజయ్ సేల్స్..యాపిల్ ఉత్పత్తులపై భారీ రాయితీని ప్రకటించింది. వచ్చే నెల 5 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద అన్ని రకాల ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, వాచెస్, ఎయిర్‌పాడ్స్‌లను తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులపై రూ.3 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను కలిపిస్తున్నది.
ఎన్ఎండీసీ సీఎండీ పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్, డిసెంబర్ 30: ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఫైనాన్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన.. మరో ఏడాది లేక కొత్త వ్యక్తిని నియమించేవరకు సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. 1995 ఐఆర్ఏఎస్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి ముఖర్జీ.