Vehicle Sales | నవంబర్ వెహికల్ సేల్స్‌లో రికార్డులు.. అధిక వడ్డీరేట్లతో ఆందోళన : సియామ్
Vehicle Sales | నవంబర్ నెలలో వెహికల్స్ సేల్స్ అదరగొట్టాయి. 2021తో పోలిస్తే 20 శాతం గ్రోత్ నమోదైంది.
Vehicle Sales | గత నెలలో వాహనాల విక్రయాల్లో రికార్డులు నమోదయ్యాయి. 2021 నవంబర్ నెలతో పోలిస్తే గత నెలలో హోల్ సేల్ వెహికల్ సేల్స్ 19.8 శాతం పెరిగాయి. గతేడాది నవంబర్ లో 12,99,716 వాహనాలు (ప్యాసింజర్ వెహికల్స్, టూ వీలర్స్, త్రీ వీలర్స్, క్వాడ్రీ సైకిల్స్) అమ్ముడైతే, గత నెలలో 15,58,145 యూనిట్ల వెహికల్స్ సేల్ అయ్యాయని ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. వీటిల్లో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, టాటా మోటార్స్, వోల్వో ఆటో సేల్స్ వివరాలను కలుపలేదు. కస్టమర్ల నుంచి సానుకూలత నెలకొన్నా.. అధిక వడ్డీరేట్లు ఆందోళనకరంగా మారాయని సియామ్ పేర్కొంది.
కార్ల విక్రయాలు గతేడాది నవంబర్‌తో పోలిస్తే 28.1 శాతం పెరిగాయి. గతేడాది 2,15,626 కార్లు అమ్ముడైతే, గత నెలలో 2,76,231 కార్లు అమ్ముడయ్యాయి. టూ వీలర్స్ సేల్స్‌లో 16.4 శాతం గ్రోత్ నమోదైంది. గతేడాది నవంబర్ నెలలో 10,61,493 టూ వీలర్స్ అమ్ముడైతే, గత నెలలో 12,36,190 యూనిట్లు సేల్ అయ్యాయి.
నవంబర్ వెహికల్ సేల్స్‌లో వినియోగదారుల్లోనూ, వ్యాపారవేత్తల్లోనూ పాజిటివ్ సెంటిమెంట్ ప్రతిబింబిస్తున్నదని సియాం ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. అధిక వడ్డీరేట్లు, దీర్ఘకాలిక వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కస్టమర్లకు ఆందోళన కలిగిస్తున్నాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో వెహికల్ సేల్స్ జరిగినా 2010-11తో పోలిస్తే త్రీ వీలర్ సేల్స్, 2016-17తో పోలిస్తే టూ వీలర్స్ సేల్స్ తక్కువే అని రాజేశ్ మేనన్ పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

