హైదరాబాద్, జూలై 14 (బిజినెస్ బ్యూరో): రాష్ర్టానికి చెందిన ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ తయారు చేసిన మరో ఔషధానికి అమెరికా అనుమతినిచ్చింది. 125 ఎంజీ / 250ఎంజీ ఐబుప్రొఫెన్ ట్యాబ్లెట్ల కు యూఎస్ఎఫ్డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా, ఇది నొప్పుల నుంచి ఊరటనిస్తుంది. ఇక ఇప్పటివరకు అనుమతినిచ్చిన మందు ల సంఖ్య దీంతో 59కి చేరుకున్నది.