US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
US Fed Meeting | అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం ఆందోళనకరస్థాయిలో కొనసాగుతున్నప్పటికీ.. ఆ దేశ కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ముందు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులపాటు జరిగిన పాలసీ సమావేశం అనంతరం.. వడ్డీ రేట్లను 3.75% నుంచి 4.00% శ్రేణిలోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
US Fed Meeting : అగ్రరాజ్యం అమెరికా (USA) లో ద్రవ్యోల్బణం (Inflation) ఆందోళనకరస్థాయిలో కొనసాగుతున్నప్పటికీ.. ఆ దేశ కేంద్ర బ్యాంక్ (Centrel Bank) అయిన ఫెడరల్ రిజర్వ్ (Fed Reserve) వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ముందు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులపాటు జరిగిన పాలసీ సమావేశం అనంతరం.. వడ్డీ రేట్లను 3.75% నుంచి 4.00% శ్రేణిలోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై స్పష్టత కోసం ఇంకొంత సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉందని, అందుకే ఈసారి పెంపునకు విరామం ఇస్తున్నామని తెలిపింది.
ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలోనే ఉందని ఫెడ్ తన ప్రకటనలో పేర్కొన్నది. వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయడంవల్ల మరిన్ని వివరాలను సేకరించి విశ్లేషించేందుకు అవకాశం లభిస్తుందని తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని తిరిగి రెండు శాతం లక్ష్యానికి సకాలంలో చేర్చేందుకు ఎలాంటి విధానాలు అవసరమో నిర్ధారించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీరేట్లను పెంచడం లేదా తగ్గించడం వంటి నిర్ణయాలను ఫెడ్ తీసుకుంటుంది. వడ్డీరేట్ల పెంపు ద్వారా రుణాలను, ఖర్చులను తగ్గించి ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది.
గత నెలలోనే ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలోని కమిటీ.. మూడేళ్లలో తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేసినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసే లక్ష్యంతో ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలలో అమెరికాలో వినియోగదారుల ధరలు గత ఏడాదితో పోలిస్తే 3.7% పెరిగాయి. ఇరాన్ యుద్ధానికి ముందు ఫిబ్రవరిలో ఇది కేవలం 2.4% గానే ఉంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ ఇది ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు సానుకూల సంకేతం కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కర్మ క్యాపిటల్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ థామస్ ప్రిజు మాట్లాడుతూ.. ఫెడ్ రేట్లను మార్చకపోవడం సానుకూలంగా కనిపించినా, ఇది తాత్కాలిక విరామం మాత్రమే కావచ్చునని అభిప్రాయపడ్డారు. ఫెడ్ పాలసీ కమిటీలో జరిగిన ఓటింగ్‌లో 10-2 తేడాతో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇద్దరు సభ్యులు 25 బేసిస్ పాయింట్ల పెంపునకు మొగ్గు చూపారని తెలిపారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఇది స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. భారత ఈక్విటీ మార్కెట్లపై దీని ప్రభావం గణనీయంగా ఉండవచ్చని ఆయన అంచనా వేశారు.
భవిష్యత్తులో అమెరికా వడ్డీ రేట్లను పెంచితే యూఎస్ బాండ్ ఈల్డ్స్, డాలర్ విలువ మరింత పెరుగుతాయని థామస్ ప్రిజు తెలిపారు. దీనివల్ల భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ఒత్తిడి పెరుగుతుందని, ఫలితంగా నిఫ్టీలో ఒడిదొడుకులు తీవ్రమవుతాయని అన్నారు. ముఖ్యంగా అధిక వ్యాల్యుయేషన్ ఉన్న స్టాక్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడిన రంగాల షేర్లు ప్రపంచ ద్రవ్యలభ్యత పరిస్థితుల్లో మార్పులకు సున్నితంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని థామస్ ప్రిజు హెచ్చరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

