Credit Suisse Layoffs | యూబీఎస్‌లో క్రెడిట్ సూయిజ్ విలీనం.. 36 వేల కొలువులు హాంఫట్..?!
Credit Suisse Layoffs | సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూయిజ్ బ్యాంకును యూబీఎస్ విలీనం చేసుకోవడంతో దాదాపు 36 వేల మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
Credit Suisse Layoffs | స్విట్జర్లాండ్‌కు చెందిన యూబీఎస్ బ్యాంకులో క్రెడిట్ సూయిజ్ విలీనం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 36 వేల మంది ఉద్యోగులు వీధిన పడనున్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంకుల పతనం కొనసాగింపుగా స్విస్ బ్యాంకింగ్ మేజర్ క్రెడిట్ సూయిజ్ కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. ఇది అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందన్న ఆందోళన మధ్య గత నెల 18న స్విట్జర్లాండ్ ప్రభుత్వం జోక్యంతో క్రెడిట్ సూయిజ్ బ్యాంకును విలీనం చేసుకున్నది యూబీఎస్. కానీ యూబీఎస్‌లో క్రెడిట్ సూయిజ్ విలీనంతో పలు సవాళ్లు పరిష్కరించాల్సి ఉంటుందని యూబీఎస్ బ్యాంక్ తెలిపింది.
రెండు బ్యాంకుల విలీనంతో దాదాపు 25 వేల నుంచి 36 వేల మంది ఉద్యోగులను తొలగించాలని యూబీఎస్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 20-30 శాతం సిబ్బందిని తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కేవలం స్విట్జర్లాండ్‌లోనే 11 వేల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపే అవకాశాలు కనిపిస్తున్నాయని స్విస్ మీడియాలో వార్తలొచ్చాయి. రెండు బ్యాంకుల విలీనానికి ముందు యూబీఎస్‌లో 72 వేల మందికి పైగా, క్రెడిట్ సూయిజ్‌లో 50 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
యూబీఎస్, క్రెడిట్ సూయిజ్ బ్యాంకులు వ్యవస్థాగతంగా అంతర్జాతీయంగా పేరున్న బ్యాంకులు కావడం గమనార్హం. కొన్నేండ్ల తరబడి వెలుగు చూస్తున్న స్కామ్‌ల తదుపరి గత నెల 15న క్రెడిట్ సూయిజ్ షేర్ విలువ పతనంతో సంక్షోభంలో చిక్కుకున్నది.ఈ రెండు బ్యాంకుల బిజినెస్‌లకు సమగ్ర రూపం తేవడానికి భారీ సవాళ్లు పొంచి ఉన్నాయని యూబీఎస్ చైర్మన్ కోల్మ్ కెల్లెహర్ ఇటీవల పేర్కొనడం గమనార్హం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

