Union Budget 2025-26 | మొరార్జీ రికార్డు సమం దిశగా నిర్మలమ్మ అడుగులు.. శనివారం కేంద్ర బడ్జెట్ .. !
Union Budget 2025-26 | వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్‌ను శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. దేశానికి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఎనిమిదో వార్షిక బడ్జెట్ సమర్పించబోతున్నారు.
Union Budget 2025-26 | వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్‌ను శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. అధిక ధరలతో మధ్య తరగతి ప్రజలు జీవనం సాగించడానికి ఇబ్బందులు పడుతున్న వేళ.. నాలుగేండ్ల క్రితం స్థాయికి వృద్ధిరేటు పతనం కావడంతోపాటు నిలిచిపోయిన వేతనాల గ్రోత్ నేపథ్యంలో ఆమె బడ్జెట్ సమర్పిస్తున్నారు. దేశానికి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఎనిమిదో వార్షిక బడ్జెట్ సమర్పించబోతున్నారు.
పది బడ్జెట్లతో మొరార్జీ దేశాయ్ రికార్డు
మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సమర్పించిన పది వార్షిక బడ్జెట్ల రికార్డుకు చేరువలో ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఆరు, 1967-1969 మధ్య నాలుగు బడ్జెట్లు సమర్పించారు. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంల్లో బడ్జెట్లు సమర్పించారు. 1959 ఫిబ్రవరి 28న తొలిసారి బడ్జెట్ సమర్పించారు. అటుపై 1962లో ఇంటరిం బడ్జెట్, తిరిగి రెండు వార్షిక బడ్జెట్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. నాలుగేండ్ల తర్వాత 1967లో ఇంటరిం బడ్జెట్, 1967-1969 మధ్య మూడు వార్షిక బడ్జెట్లు సమర్పించారు.
తొమ్మిది బడ్జెట్లు సమర్పించిన చిదంబరం
వేర్వేరు సమయాల్లో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తొమ్మిది బడ్జెట్లను పార్లమెంట్‌కు సమర్పించారు. తొలిసారి 1996 లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ సమర్పించారు. హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా ఉండగా 1996 మార్చి 19న తొలి బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. తిరిగి 1997లో బడ్జెట్ సమర్పించారు. 2004-08 మధ్య వరుసగా ఐదు బడ్జెట్లను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. కొంత కాలం హోంమంత్రిగా పని చేసిన చిదంబరం.. తిరిగి 2013, 2014ల్లో బడ్జెట్ సమర్పించారు.
ఇందిరాగాంధీ హయాం నుంచి వేర్వేరు సందర్భాల్లో ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లు సమర్పించారు. తొలిసారి 1982, 1983, 1984, 2009 ఫిబ్రవరి – 2012 మార్చి మధ్య ఐదు బడ్జెట్లను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు.
ఐదు బడ్జెట్లు సమర్పించిన మన్మోహనుడు
ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకూ ఐదు బడ్జెట్లు సమర్పించారు. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పని చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

