Oppo- OnePlus 5G | ఆ రెండు ఒప్పో.. వన్‌ప్లస్ 5జీ ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు..4 నుంచి ప్రారంభం!
Oppo-OnePlus | అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్స్ లో భాగంగా ఒప్పో, వన్ ప్లస్ 5జీ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Oppo- OnePlus 5G | అందుబాటు ధరలో బెటర్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని భావిస్తున్నారా.. ఆ అవకాశం మిస్ చేసుకోకండి.. ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల నాలుగో తేదీ నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఈ ఆఫర్లతో ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
ఒప్పో ఏ78 5జీపై ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్లు
మీరు రూ.20 వేల లోపు ధరతో పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ కావాలని చూస్తున్నారా.. అయితే అందుకు ఒప్పో ఏ78 5జీ సరైన ఆప్షన్. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తున్నది. వాస్తవంగా ఈ ఫోన్ ధర రూ.21,999. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్స్‌లో భాగంగా ఇది రూ.18,999లకే వస్తుంది. మూడు బ్యాంకుల కార్డులపై రూ.1150 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంటుంది. దీంతోపాటు పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.17,050 వరకు ఉంది. దాని పనితీరును బట్టి ధరలో రాయితీ ఉంటుంది.

ఒప్పో ఏ78 5జీ ఫోన్.. 6.5-అంగుళాల ఎల్సీడీ ప్యానెల్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
వన్ ప్లస్ 10 ప్రో 5జీపై ఆఫర్లు ఇలా
వన్‌ప్లస్ ఫోన్ ప్యాన్స్‌కు సంతోషకరమైన వార్త.. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ విత్ 8 జీబీ రామ్ అండ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల ఫోన్. దీని వాస్తవ ధర రూ.66,999. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్స్‌లో 16 శాతం డిస్కౌంట్‌పై రూ.55,999లకు లభ్యం అవుతుంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.1000, ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా రూ.25,650 వరకు ధర తగ్గింపునకు అవకాశం ఉంటుంది.

వన్ ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ 6.7-అంగుళాల క్యూహెచ్డీ+ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే విత్ 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 8- మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సర్, సెల్ఫీలకోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

