Aadhar Update | గడువు పొడిగించిన UIDAI.. మరో మూడు నెలలూ ఉచితంగానే ఆధార్ అప్ డేట్
Aadhar Update | ఆధార్ అప్ డేట్ పై విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) కీలక నిర్ణయం తీసుకున్నది. మరో మూడు నెలల వరకూ ఉచితంగా అప్ డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
Aadhar Update | గతంలో గుర్తింపు కార్డు అంటే ఓటరు గుర్తింపు కార్డు.. డ్రైవింగ్ లైసెన్స్.. పాన్ కార్డు.. కానీ విశ్వజనీన గుర్తింపు కార్డుగా ‘ఆధార్’ నిలిచింది. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా.. ఉద్యోగంలో చేరాలన్నా.. ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఆధార్ కీలకం. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డులో నంబర్‌తోపాటు బయో మెట్రిక్ అథంటికేషన్ ఉంటుంది. కండ్లకు ఐరిష్ రికగ్నిషన్ ఉంటుంది. అంత ముఖ్యమైన ఆధార్ కార్డులను ప్రతి పదేండ్ల కోసారి అప్ డేట్ చేసుకోవాలని విశిష్ట ప్రాధికార సంస్థ (యూఏడీఏఐ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్లో ఆధార్ ఉచితంగా అప్ డేట్ చేసుకునే గడువును మరోమారు పొడిగించింది యూఐడీఏఐ. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 14తో గడువు ముగియాల్సి ఉంది. కానీ, తాజాగా మరో మూడు నెలల పాటు ఉచితంగా ఆధార్ అప్ డేట్ గడువును పొడిగించింది. ఈ గడువు దాటిన తర్వాత అప్ డేట్ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఫీజు పే చేయాల్సి ఉంటుంది.
ఆధార్ వివరాల నమోదులో భాగంగా జెండర్ తోపాటు బర్త్ డే, అడ్రస్ తదితర వివరాలు నిర్దేశిత గడువు వరకు ఫ్రీగానే అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ తీసుకుని పదేండ్లు దాటిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది యూఐడీఏఐ. పదేండ్లుగా అప్ డేట్ చేసుకోని వారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అందుకు పౌరులు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకునే వారు మై ఆధార్ పోర్టల్ కి వెళ్లి.. డాక్యుమెంట్ అప్ డేట్ విభాగంలో పేరు/ జెండర్ / పుట్టిన తేదీ/ చిరునామా ఆప్షన్లలో మీకు అవసరమైన ఆప్షన్ ఎంచుకోవాలి. అటుపై అప్ డేట్ ఆధార్ ఆన్ లైన్ ఆప్షన్ ఎంచుకుని.. అందుకు అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేస్తే సరి.. అటుపు 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దీని సాయంతో ఆధార్ అప్ డేట్ స్టేటస్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

