న్యూయార్క్, ఏప్రిల్ 25: మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికే చిక్కనున్నది. సంస్థను 43 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసేందుకు మస్క్ ఇచ్చిన ఆఫర్‌కు ట్విట్టర్ బోర్డ్ ఆమోదం ప్రకటిస్తుందం టూ సోమవారం రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. షేరుకు రూ.54.20 ధరతో ట్విట్టర్ షేర్‌హోల్డర్ల నుంచి వాటాల్ని సొంతం చేసుకునేందుకు రెండు వారాల క్రితం మస్క్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ లావాదేవీని షేర్హోల్డర్లకు ట్విట్టర్ బోర్డు సిఫార్సు చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే చివరి నిముషంలో లావాదేవీ రద్దయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు హెచ్చరించాయి.