హైదరాబాద్, డిసెంబర్ 28: వంటింటి ఉపకరణాల తయారీలో అగ్రగామి సంస్థ టీటీకే ప్రిస్టేజ్.. తాజాగా ఒమేగా సెలెక్ట్ ప్లస్-పనియారక్కల్/అప్పె పాత్రాను విడుదల చేసింది. ఈ నూతన పనియారక్కల్తో ఎన్నో రకాల రుచికర వంటకాలను తయారు చేయడానికి వీలుంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వీటిలో అప్పాలు, పొంగనాలు తయారుచేసుకునే ఈ పాత్ర ధరను రూ.1,400(12 గుంతలు), 16 గుంతల ధరను రూ. 1,750గా నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్ కింద 20 శాతం తగ్గింపుతో విక్రయిస్తున్నది సంస్థ. ఈ ఉపకరణాలు ఎంపిక చేసిన ఎక్స్క్లూజివ్ స్టోర్లు, డీలర్ల వద్ద మాత్రమే లభించనున్నాయి.