వాణిజ్య లోటు పైపైకి
దేశీయ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గత నెల వాణిజ్య లోటు మునుపెన్నడూ లేనిస్థాయికి ఎగబాకింది. జూన్‌లో రికార్డు గరిష్ఠాన్ని తాకుతూ 26.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గురువారం కేంద్ర వాణిజ్య మంత్రి త్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశం నుంచి ఎగుమతులు 40.13 బిలియన్ డాలర్లు
జూన్‌లో ఆల్‌టైం హైకి చేరిక..
26.18 బిలియన్ డాలర్లుగా నమోదు
న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గత నెల వాణిజ్య లోటు మునుపెన్నడూ లేనిస్థాయికి ఎగబాకింది. జూన్‌లో రికార్డు గరిష్ఠాన్ని తాకుతూ 26.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గురువారం కేంద్ర వాణిజ్య మంత్రి త్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశం నుంచి ఎగుమతులు 40.13 బిలియన్ డాలర్లుగా ఉంటే.. దేశంలోకి దిగుమతులు 66.31 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతంతో పోల్చితే ఈ జూన్‌లో ఎగుమతులు 23.52 శాతం, దిగుమతులు 57.55 శాతం పెరిగాయి. అయితే వీటికి తగ్గట్టుగా వాణిజ్య లోటూ ఎగిసిపడింది. నిరుడు జూన్‌లో 9.6 బిలియన్ డాలర్లుగానే ఉన్నది. నిజానికి ఈసారి వాణిజ్య లోటును 25.63 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అయినప్పటికీ దాన్ని దాటేసి నమోదు కావడం ఇప్పుడు కలవరపెడుతున్నది.
మే నెలలోనూ..
ఈ ఏడాది మే నెలలోనూ దేశ వాణిజ్య లోటు రికార్డు గరిష్ఠంగానే నమోదైంది. అప్పుడు 24.3 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇదే ఇప్పటిదాకా ఆల్‌టైం హై. ఇప్పుడు దీన్ని చెరిపేస్తూ జూన్‌లో కొత్త రికార్డు వచ్చింది. ఇక గత ఏడాది జూన్‌తో పోల్చితే వాణిజ్య లోటు 172.7 శాతం పెరగడం గమనార్హం.
- ఈసారి దేశ దిగుమతుల్లో అగ్ర భాగం బొగ్గు, బంగారం, పెట్రోలియం ఉత్పత్తులదే
- బొగ్గు 260.6 శాతం (6.76 బిలియన్ డాలర్లు), బంగారం 183 శాతం (2.7 బిలియన్ డాలర్లు), పెట్రోలియం 99.5 శాతం (21.3 బిలియన్ డాలర్లు) చొప్పున దిగుమతి
- దేశ ఎగుమతుల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, బియ్యం ప్రధానం
- కాటన్ యార్న్, హండ్లూమ్, ప్లాస్టిక్, లినోలియం ఉత్పత్తులకూ డిమాండ్
- ఏప్రిల్-జూన్‌లో దేశ ఎగుమతులు 24.51 శాతం వృద్ధితో 118.96 బిలియన్ డాలర్లకు
- దిగుమతులు 49.47 శాతం పెరిగి 189.76 బిలియన్ డాలర్లకు
- గత మూడు నెలల్లో 70.8 బిలియన్ డాలర్లను తాకిన వాణిజ్య లోటు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

