Cars Price Costly | ఆ కార్ల ధరలు మరింత కాస్ట్లీ.. టయోటా, బీఎండబ్ల్యూ ఎంత పెంచాయంటే?!
Cars Price Costly | ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్నికార్ల ధరలు పెరుగుతాయి. టయోటా 4%, బీంఎడబ్ల్యూ 3.5% పెంచుతామని తెలిపాయి.
Cars Price Costly | ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో పెరిగిన ముడి సరుకు ధరల ప్రభావం కార్ల విక్రయ రేట్లపై భారీగానే ప్రభావం పడుతున్నది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు టయోటా కిర్లోస్కర్ మోటార్స్, బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెజ్-బెంజ్ సంస్థలు ఏప్రిల్ నుంచి కార్ల ధరలు పెంచనున్నాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) అన్ని రకాల మోడల్ కార్ల ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నాలుగు శాతం పెరుగుతాయని శనివారం ప్రకటించింది.
ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడమే దీనికి కారణమని తెలిపింది. ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా వంటి మోడల్ కార్ల తయారీకి వాడే ముడి సరుకుతోపాటు ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో ధరలు పెంచుతున్నట్లు టీకేఎం వెల్లడించింది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా తమ కార్ల ధరలు ఏప్రిల్ నుంచి పెరుగుతాయని తెలిపింది. అన్ని రకాల కార్ల ధరలు 3.5 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. దేశీయంగా 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్, 3 సిరీస్ గ్రాన్, లిమౌసిన్, ఎం 340ఐ, 5 సిరీస్, 6 సిరీస్ గ్రాన్ టరిస్మో, 7 సిరీస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్4, ఎక్స్5, ఎక్స్7, మినీ కంట్రీమన్ వంటి మోడల్ కార్లు తయారు చేస్తున్నది. బీఎండబ్ల్యూ డీలర్లు 8 సిరీస్ గ్రాన్ కూపె, ఎక్స్6, జడ్4, ఎం2 కాంపిటీషన్, ఎం5 కాంపిటీషన్, ఎం8 కూపె, ఎక్స్3, ఎం, ఎక్స్5 ఎం, ఐఎక్స్ కూడా విక్రయిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

