EV Cars | ప్రపంచ దేశాలన్నీ మరింత సుస్థిర, పర్యావరణ ఫ్రెండ్లీ మొబిలిటీ దిశగా షిఫ్ట్ అవుతున్నాయి. ఈ తరుణంలో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో పర్సనల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రోజురోజుకి పాపులారిటీ పెంచుకుంటున్నాయి. నూతన కారు కొనుక్కోవాలనుకునేవారు అత్యంత అందుబాటు ధరలో ఉన్న ఈవీ కార్లను ఎంచుకోవడం బెటర్. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రూ.15 లక్షల్లోపు ధరకు అందుబాటులో ఉన్న ఈవీ కార్లపై ఓ లుక్కేద్దామా..!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటి టాటా మోటార్స్..దేశీయ ఈవీ రివల్యూషన్లో ముందు వరుసలో దూసుకెళ్తున్నది. ఆ సంస్థ టియాగో ఈవీ కారు దేశంలో అత్యంత చౌక ధరకు అందుబాటులో ఉన్న కారు. సింగిల్ చార్జింగ్‌తో 315 కి.మీ. దూరం ప్రయాణించగల కెపాసిటీ దీని సొంతం. దీని ధర రూ.8.69 లక్షలు. భారత మార్కెట్లో అత్యంత చౌకగా అందుబాటులో ఉన్న హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ కారు టియాగో ఈవీ.
అత్యంత పాత ఈవీ కార్ల జాబితాల్లో మహీంద్రా ఈ-వెరిటో ఒకటి. దీని ధర రూ.9.13 లక్షల నుంచి మొదలవుతుంది. భారత్‌లో అత్యంత చౌక కార్లలో ఇదొకటి. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు సింగిల్ చార్జింగ్‌తో 140 కి.మీ. దూరం ప్రయాణించగలుగుతుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ గల కారు ఇది. డీసెంట్ సైజ్‌తోపాటు తక్కువ ధరకే అందుబాటులో ఉన్న కారిది. ప్రయాణ అవసరాలకు ఇది మంచి ఆప్షన్‌గా ఉంటుంది.
గతేడాది ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్.. భారత్ మార్కెట్లోకి గతేడాది ఈవీ `సీ3` హ్యాచ్‌బ్యాక్ కారు ఈ-సీ3 కారును ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లో సిట్రోల్ తొలి ఈవీ కారు. దీని ధర రూ.11.50 లక్షలు. సింగిల్ చార్జింగ్‌తో 320 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. టాటా టియాగో లాంగ్ రేంజ్ వర్షన్ ఈవీ కారుతో ఈ-సీ3 పోటీ పడుతుందని భావిస్తున్నారు.
టాటా మోటార్స్ నుంచి వస్తున్న సబ్-4ఎం ఎలక్ట్రిక్ సెడాన్ కారు టాటా టైగోర్. టైగోర్ సెడాన్ ఎలక్ట్రిక్ వర్షన్‌కు స్వల్ప స్టైలింగ్ చార్జీలు మాత్రమే చేశారు. భారత్ మార్కెట్లో టూరిస్ట్ కార్ల యజమానులు, క్యాబ్ అగ్రిగేటర్స్‌కు అత్యంత పాపులర్ చాయిస్ టాటా టైగోర్ ఈవీ. దీని ధర రూ.12.49 లక్షల నుంచి మొదలవుతుంది. సింగిల్ చార్జింగ్‌తో 315 కి.మీ. దూరం ప్రయాణిస్తున్నది. ప్రస్తుతానికి భారత్ మార్కెట్లో దీంతో పోటీ పడే ఈవీ కారు లేదు.
ఎలక్ట్రిక్, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న తొలి కారు టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్. భారత్‌లో అత్యంత పాపులర్ ఎస్యూవీ కారు నెక్సాన్. దీన్నే రీబ్రాండ్ చేసి నెక్సాన్ ఈవీ ప్రైమ్‌గా మార్కెట్లోకి తెచ్చింది టాటా మోటార్స్. లాంగ్ రేంజ్ వర్షన్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. సింగిల్ చార్జింగ్‌తో 312 కి.మీ.దూరం ప్రయాణించే సత్తా దీని సొంతం. దీని ధర రూ.14.49 లక్షలు.