Top 10 SUV Cars | టాప్ ఎస్యూవీ సేల్స్‌లో టాటా పంచ్ ఫస్ట్.. స్కార్పియోను బీట్ చేసిన క్రెటా..!
Top 10 SUV Cars | గత నెలలో టాప్-10 ఎస్యూవీ కార్ల విక్రయాల్లో టాటా పంచ్ మొదటి స్థానంలో కొనసాగగా, మహీంద్రా స్కార్పియోను హ్యుండాయ్ క్రెటా బ్రేక్ చేసింది.
Top 10 SUV Cars | రోజురోజుకూ దేశంలో పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరుగుతున్నది. అందునా భారతీయులు ఎస్యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. ఇటీవలి వరకూ ఎస్యూవీ కార్ల సెగ్మెంట్లో నువ్వా, నేనా అన్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి మధ్య పోటీ నెలకొంది. కానీ తాజాగా టాటా మోటార్స్ తయారు చేసిన ఎస్యూవీ కార్లు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా నిలిచాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ విశ్లేషకుల అంచనాలను దాటేసి గత నెల టాప్-10 ఎస్యూవీ కార్లలో టాటా మోటార్స్ వారి టాటా నెక్సాన్, టాటా పంచ్ నిలిచాయి. టాప్-10లో టాటా పంచ్ చోటు దక్కించుకోవడం వరుసగా ఇది రెండో నెల. గత జనవరిలో ఆవిష్కరించినప్పటి నుంచి టాటా పంచ్ ఎస్యూవీ ఫ్యామిలీ టాటా పంచ్.ఈవీ అమ్మకాలు పెరుగుతున్నాయి.
2 నెలలుగా పెరిగిన టాటా పంచ్ సేల్స్
టాటా మోటార్స్ నుంచి మార్కెట్లోకి వచ్చిన బుల్లి ఎస్యూవీ టాటా పంచ్ సేల్స్ రెండు నెలలుగా పెరుగుతున్నాయి. బుల్లి ఎస్‌యూవీల్లో వరుసగా రెండోనెలగా బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నిలిచింది. పంచ్ ఈవీతోపాటు టాటా పంచ్ 18,438 యూనిట్లు అమ్ముడయ్యాయి. పంచ్.ఈవీతోపాటు గతేడాది ఫిబ్రవరి నుంచి పంచ్ కార్ల సేల్స్ 65 శాతం పెరిగాయి. గత జనవరిలో 17,978 యూనిట్ల పంచ్ కార్లు అమ్ముడయ్యాయి.
రెండో స్థానంలో మారుతి బ్రెజా..
ఎస్యూవీ కార్ల విక్రయాల్లో మారుతి బ్రెజా ఒకటి. గత నెల ఎస్యూవీ సెగ్మెంట్ కార్ల విక్రయాల్లో మారుతి బ్రెజాకు రెండోస్థానం లభించింది. గతేడాదితో పోలిస్తే గత నెలలో 15,765 యూనిట్లు విక్రయించింది. జనవరిలో 15,303 యూనిట్ల మారుతి బ్రెజా కార్లు అమ్ముడయ్యాయి.
బ్రెజా తర్వాత క్రెటా
హ్యుండాయ్ క్రెటా కార్ల విక్రయాలు పెరగడంలో దాని ఫేస్‌లిఫ్ట్ వర్షన్ జత కలిసింది. ఫలితంగా గత నెలలో అమ్మడైన టాప్-10 ఎస్‌యూవీల్లో హ్యుండాయ్ క్రెటా మూడో స్థానాన్ని దక్కించుకున్నది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ కంటే మెరుగ్గా హ్యుండాయ్ క్రెటా కార్లు 15,276 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే 47 శాతం పెరిగింది. జనవరిలో ఆవిష్కరించిన హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సాయంతో క్రెటా 13,212 యూనిట్లు అమ్ముడయ్యాయి.
మహీంద్రా స్కార్పియో దూకుడు ఇలా
మహీంద్రా అండ్ మహీంద్రా ఫ్లాగ్షిప్ ఎస్యూవీ మోడల్ స్కార్పియోలో స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గత నెల ఎస్యూవీ కార్ల విక్రయాల్లో స్కార్పియో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది ఫిబ్రవరి నుంచి 110 శాతానికి పైగా సేల్స్ పెరిగాయి. గత నెలలో 15,051 యూనిట్ల స్కార్పియో కార్లు అమ్ముడయ్యాయి. స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కార్ల ఆవిష్కరణ తర్వాత ఒక నెలలో 15 వేలకు పైగా అమ్ముడు కావడం ఇదే తొలిసారి. గత జనవరిలో స్కార్పియో సేల్స్ 14,293 యూనిట్లు అమ్ముడయ్యాయి.
అత్యంత పాపులర్ టాటా నెక్సాన్
దేశంలోనే అత్యంత పాపులర్ ఎస్‌యూవీగా ఉన్న టాటా నెక్సాన్ సేల్స్ గత నెలలో తగ్గడంతో టాప్-5వ స్థానంలోకి పడిపోయింది. దాదాపు ఏడాది కాలంగా ఎస్యూవీ కార్ల విక్రయాల్లో టాటా నెక్సాన్ మొదటి స్థానంలో నిలుస్తున్నా, ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరిలో టాటా నెక్సాన్ కార్ల విక్రయాలు 14,395 యూనిట్లకు చేరాయి. జనవరిలో 17,182 యూనిట్ల టాటా నెక్సాన్ కార్లు అమ్ముడు కావడం గమనార్హం.
మారుతి బుల్లి ఎస్యూవీ ఫ్రాంక్స్ ఇలా
మారుతి సుజుకి బుల్లి ఎస్యూవీ కారు మారుతి ఫ్రాంక్స్ సేల్స్‌లో ఆరో స్థానానికి పరిమితమైంది. గత జనవరిలో 13,643 కార్లు అమ్ముడైతే, గత నెలలో 14,618 కార్లు అమ్ముడు పోయాయి. బుల్లి ఎస్యూవీ ఫ్రాంక్స్ హైబ్రీడ్ వర్షన్ పెంచాలని భావిస్తుండటంతో మున్ముందు మారుతి ఫ్రాంక్స్ సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక హ్యుండాయ్ క్రెటాతో పోటీ పడుతున్న గ్రాండ్ విటారా గత నెలలో 11,002 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే గ్రాండ్ విటారా సేల్స్ 20 శాతం పెరిగాయి. కానీ జనవరితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. గత జనవరిలో మారుతి గ్రాండ్ విటారా కార్లు 13,438 యూనిట్లు ఉన్నారు.
పాత మోడల్ బోలెరో ఇలా
మహీంద్రా అండ్ మహీంద్రా ఐకానిక్ ఎస్యూవీ కార్లలో బొలెరో ఒకటి. గత నెల సేల్స్ 10,113 యూనిట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకున్నది. గతంతో పోలిస్తే స్వల్పంగా మూడు శాతం పెరిగింది. గతేడాది ఫిబ్రవరిలో బొలెరో నియోతోపాటు మహీంద్రా బొలెరో 9,782 యూనిట్లు విక్రయించారు. కియా సబ్ కంపాక్ట్ ఎస్యూవీ సోనెట్ టాప్-10లో నిలిచింది. గత నెలలో కియా సొనెట్ 9,102 యూనిట్లు విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఏడు శాతం సొనెట్ కార్ల విక్రయాలు పెరిగాయి. జనవరిలో సొనెట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించడంతో 11,530 యూనిట్లు విక్రయించింది. హ్యుండాయ్ సబ్ కంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ కూడా బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. గత నెలలో 8,993 యూనిట్ల హ్యుండాయ్ వెన్యూ కార్లు అమ్ముడు పోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

