E-Filing Password | ఈ-ఫైలింగ్ పాస్వర్డ్ మరిచిపోయారా..? ఇలా చేస్తే సరి!
E-Filing Password | ఆధార్ అనుసంధాన మొబైల్, డిజిటల్ సిగ్నేచర్ అప్లోడ్, ఈ-ఫైలింగ్ ఓటీపీతో ఐటీ పోర్టల్‌లో పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి.

E-Filing Password | గత ఆర్థిక సంవత్సర (2020-21) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు దగ్గర పడుతోంది. ఈ నెలాఖరుతో గడువు ముగిసిపోనున్నది. మీలో ఎవరైనా ఇప్పటికీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా.. ఐటీ పోర్టల్‌లో మీ లాగిన్ పాస్వర్డ్ మరిచిపోయారా.. అయితే మీరు మీ లాగిన్ పాస్వర్డ్ తేలిగ్గా రీసెట్ చేసుకోవచ్చునని ఆదాయం పన్నుశాఖ చెబుతోంది.
మీ ఇన్‌కం టాక్స్ పోర్టల్ ప్రొఫైల్‌లో పాస్వర్డ్ రీసెట్ ఇలా..
- ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ
- డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ అప్లోడ్
- ఈ-ఫైలింగ్ ఓటీపీ వాడాలి
ఇలా ఆధార్ ఓటీపీని ఉపయోగించి పాస్వర్డ్ రీసెట్
- ఫస్ట్ ఈ-ఫైలింగ్ హోంపేజీకి వెళ్లి లాగిన్ క్లిక్ చేయాలి.
- మీరు మీ యూజర్ ఐడీ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి
- లాగిన్ స్క్రీన్ మీదకెళ్లి సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ కింద ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- ఎంటర్ యూజర్ ఐడీ టెక్ట్స్ బాక్స్‌లో మీ యూజర్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి.
- రీసెట్ పాస్పవర్డ్ పేజీ ఆప్షన్ సెలక్ట్ చేయాలి.. అటుపై మీ ఆధార్ ఓటీపీ ఆప్షన్ సెలక్ట్ చేయాలి.
ఒకవేళ మీరు ఇప్పటికే ఆధార్ ఓటీపీ పొంది ఉన్నారనుకుంటే..
- ఆధార్‌తో నా రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్లో ఓటీపీ పొందాను అనే ఆప్షన్ సెలక్ట్ చేయాలి.
తదుపరి ఆరు అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి.. అటుపై కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి. - సెలెక్ట్ జనరేట్ ఓటీపీ.. కంటిన్యూ క్లిక్ చేయాలి
- వెరిఫై యువర్ ఐడెంటిటీ పేజీకెళ్లి డిక్లరేషన్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి.. జనరేట్ ఆధార్ ఓటీపీ క్లిక్‌మనిపించాలి.
మీ ఆధార్ లింక్డ్ మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీని ఓటీపీ టెక్ట్స్ బాక్స్‌లో ఎంటర్ చేసి క్లిక్ చేయాలి.
- అయితే, ఈ ఓటీపీ 15 నిమిషాలే చెల్లుబాటవుతుంది.
కరెక్ట్ ఓటీపీ టైప్ చేయడానికి మీకు మూడు అవకాశాలే ఉంటాయి.
ఓటీపీ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు ఓటీపీ ఎక్స్పైరీ స్క్రీన్‌పై కౌంట్ డౌన్ టైం మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది.
ఓటీపీ ఎక్స్పైరీ అయిపోయినప్పుడు మీరు మళ్లీ రీసెండ్ ఓటీపీ క్లిక్ చేసి.. నూతన ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. ఓటీపీ సబ్మిషన్ పూర్తయ్యాక.. న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సుమా. - నూతన పాస్వర్డ్.. కన్ఫర్మ్ పాస్వర్డ్ టైప్ చేసి సబ్మిట్ కొట్టాలి.
- పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. కనీసం 8 క్యారెక్టర్ల నుంచి 14 క్యారెక్టర్ల లోపు న్యూ పాస్వర్డ్ ఉండాలి.
అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్లు కలపడంతోపాటు నంబర్ కూడా యాడ్ చేయాలి.. ఉదాహరణకు మీరు ప్రత్యేక క్యారెక్టర్ (@#$% అని ఉండాలి.
ఈ-ఫైలింగ్ ఓటీపీతో మీ ఇన్‌కం టాక్స్ పోర్టల్ పాస్వర్డ్ రీసెట్ ఇలా
- ఈ-ఫైలింగ్ హోంపేజీకి వెళ్లి లాగిన్ క్లిక్ చేయాలి
యూజర్ ఐఈ టైప్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి
లాగిన్ స్క్రీన్‌పై.. సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ కింద ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
ఆప్షన్ టు రీసెట్ పాస్వర్డ్ పేజీని సెలెక్ట్ చేసి.. యూజ్ ఈ-ఫైలింగ్ ఓటీపీని క్లిక్ చేయాలి.. అటుపై కంటిన్యూ క్లిక్ చేయాలి. - ఈ-ఫైలింగ్ ఓటీపీ పేజీని యూజ్ చేస్తూ రీసెట్ పాస్వర్డ్ ఫార్మాట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయాలి.
అటుపై మీ రిజిస్టర్డ్ సెల్‌ఫోన్ నంబర్‌కు గానీ, ఈ-మెయిల్ అడ్రస్‌కు గానీ వచ్చే రెండు 6-అంకెల ఓటీపీలను ఎంటర్ చేశాక.. వెరిఫై ఆప్షన్ క్లిక్ చేయాలి. - సెట్ న్యూపాస్వర్డ్ ఆప్షన్ వద్ద న్యూ పాస్వర్డ్ నమోదు చేసి.. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
ట్రాన్సాక్షన్ ఐడీతోపాటు సక్సెస్ మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. భవిష్యత్‌లో జరిపే సంప్రదింపులు, ట్రాన్సాక్షన్స్ కోసం ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్‌ను గుర్తు పెట్టుకోవాలి.
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్సీ)తో పాస్వర్డ్ రీసెట్ ఎలా?
- ఈ-ఫైలింగ్ హోంపేజీకి వెళ్లి.. లాగిన్ క్లిక్‌మనిపించాలి
- మీ యూజర్ ఐడీ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ నొక్కాలి.
- లాగిన్ స్క్రీన్ మీద.. అండర్ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ కింద.. ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- ఆప్షన్ టు రీసెట్ పాస్వర్డ్ పేజ్ సెలెక్ట్ చేయాలి.. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్సీ) అప్లోడ్ చేసి కంటిన్యూ క్లిక్‌మనిపించాలి.
- తర్వాత అప్రొప్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి క్లిక్ కంటిన్యూ చేయాలి.
- మీకు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్డ్ డీఎస్సీ లేకపోతే న్యూ డీఎస్సీ ఆప్షన్ నొక్కాలి.
- అటుపై డౌన్లోడ్ ఎంసింగర్ యుటిలిటీ ఆప్షన్ వద్దకెళ్లి క్లిక్ అనాలి.
- ఎంసింగర్ యుటిలిటీ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత నేను ఎంసింగర్ యుటిలిటీని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నా అనే ఆప్షన్ నొక్కాలి.. అటుపై కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- డేటా సైన్ స్క్రీన్ మీద యువర్ ప్రొవైడర్, సర్టిఫికెట్, ప్రొవైడర్ పాస్వర్డ్ సెలెక్ట్ చేయాలి. సైన్ బటన్ క్లిక్ చేసి సైన్ చేయాలి.
- న్యూ పాస్వర్డ్ సెట్లో న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి.. అటుపై సబ్మిట్ కొట్టాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

