Maruti Suzuki Brezza | ఈ బెస్ట్ సెల్లింగ్ మారుతి ఎస్‌యూవీపై రూ.42 వేల వరకూ డిస్కౌంట్..!
Maruti Suzuki Brezza | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన కంపాక్ట్ ఎస్యూవీ మారుతి బ్రెజా సేల్స్ పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించింది. గరిష్టంగా రూ.42 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీ, బ్రెజా వంటి మోడల్ కార్లతో గట్టి ఎస్యూవీ పోర్ట్ ఫోలియో కలిగి ఉంది. వీటిల్లో అత్యధిక యూనిట్లు అమ్ముడయ్యే బ్రెజా మోడల్ కారుపై ఈ నెలలో రూ.42 వేల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. మారుతి సుజుకి బ్రెజా అర్బనో ఎడిషన్ కారుపై రూ.42 వేల వరకూ, బ్రెజా పెట్రోల్ వేరియంట్ మీద రూ.25 వేల వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. బ్రెజా సీఎన్జీ మోడల్ కార్లపై డిస్కౌంట్లు లేవు. మారుతి బ్రెజా కారు ధర రూ.8.34 లక్షల నుంచి రూ.14.14 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది. టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, హ్యుండాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి కంపాక్ట్ ఎస్యూవీ కార్లతో పోటీ పడుతుందీ మారుతి సుజుకి బ్రెజా.
మారుతి సుజుకి బ్రెజా 1.5 లీటర్ల కే15సీ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 103 పీఎస్, 137 ఎన్ఎం టార్క్ వెలువరించడంతోపాటు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ ఆప్షన్లోనూ మారుతి సుజుకి బ్రెజా వస్తుంది. అయితే సీఎన్జీ ఆప్షన్ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ గా మాత్రమే లభిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్ యూవీ కార్లలో మారుతి సుజుకి బ్రెజాది మూడో స్థానం. 2023-24లో 1,69,897 యూనిట్ల మారుతి సుజుకి కార్లు అమ్ముడు పోయాయి. టాటా నెక్సాన్ 1,71,697, టాటా పంచ్ 1,70,076 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఇవి కూడా చదవండి :
Best Family Cars | రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ ఫ్యామిలీ కార్లివే.. !
Union Budget | 1947 నుంచి 2024 వరకూ బడ్జెట్లో మార్పులూ చేర్పులూ ఇలా..
Union Budget 2025 | కొలువుల కల్పనే కష్టం.. నిర్మలమ్మ ‘బడ్జెట్’ ముందు సవాళ్లివే..!
Union Budget 2024-25 | ఏడో బడ్జెట్‌తో ఆయన రికార్డుకు విత్త మంత్రి నిర్మలమ్మ బ్రేక్..?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

