Credit Card | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. వారిలో కొంత మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. కానీ కొందరు ఎమర్జెన్సీలో వాడదామని, అన్నీ వాడటం ఎందుకని ఇంకొందరు ఒకటి మినహా మిగతా క్రెడిట్ కార్డులను పక్కన బెడతారు. ఇప్పటికిప్పుడు అలా క్రెడిట్ కార్డులు పక్కన పెట్టకపోవడం వల్ల ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు గానీ.. దీర్ఘకాలంలో కొన్ని బెనిఫిట్లు వదులు కోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు వాడకపోతే రుణాల ఊబిలో చిక్కుకోకపోవచ్చు.. కానీ, కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అవసరమైన చోట వాడుతూ సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మెరుగైన క్రెడిట్ స్కోర్ నిర్వహణకు సరైన మార్గం. మంచి సిబిల్ స్కోర్ వల్ల లభించే బెనిఫిట్ల గురించి చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి ఈఎంఐ పేమెంట్‌లో ఆలస్యమైనా, ఇతర కారణాల వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాన్ని సరైన దారిలో పెట్టేందుకు క్రెడిట్ కార్డు వాడకమే సరైన నిర్ణయం.. ఆ క్రెడిట్ కార్డు రెగ్యులర్‌గా వాడకపోతే ఆ బెనిఫిట్ కోల్పోయినట్లే.. తీసుకున్న క్రెడిట్ కార్డు సుదీర్ఘ కాలం వాడకున్నా క్రెడిట్ హిస్టరీ నష్టపోయినట్లేనని ఆర్థికవేత్తలు అంటున్నారు.
క్రెడిట్ కార్డును 40 శాతానికి మించి వాడుకోవద్దు.. ఆ పరిమితికి మించి క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే.. మీరు రుణాలపై ఆధార పడుతున్నారని బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు మీ క్రెడిట్ లిమిట్ పెంచుతాయి. దానివల్ల ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు వాడుకునే వెసులుబాటు ఉంటది. అలా కాకుండా క్రెడిట్ కార్డు వాడకుండా పక్కన బెడితే.. మీ అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మొత్తం వాడుకునే అవకాశముండదు.
ఎక్కువ కాలం క్రెడిట్ కార్డు వాడకుంటే వాటిని బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు డీయాక్టివేట్ చేసేస్తాయి. అందుకు చార్జీలు కూడా వసూలు చేస్తాయి. మళ్లీ ఆ కార్డు రెన్యూవల్ చేసుకోవాలంటే చార్జీలు పే చేయాలి.. కనుక ఒక క్రెడిట్ కార్డు తీసుకునే ముందు రూల్స్ తెలుసుకోవాలి.
క్రెడిట్ కార్డులపై రివార్డులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రాయితీలు ఉంటాయి. క్రెడిట్ కార్డు వాడకానికి అవకాశం ఉన్న చోట వాటిని వాడకపోతే ఆ బెనిఫిట్లన్నీ కోల్పోవాల్సి వస్తది. దీనికి తోడు సదరు క్రెడిట్ కార్డుపై చెల్లించే యాన్యువల్ ఫీజు వేస్ట్ అవుతుంది. సుదీర్ఘమైన క్రెడిట్ హిస్టరీ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్లకు ఎంతో కీలకం. క్రెడిట్ ప్రొడక్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటే.. క్రెడిట్ హిస్టరీనే చూస్తారు. మీ క్రెడిట్ హిస్టరీ నిర్మాణంలో క్రెడిట్ కార్డు కీలకంగా వ్యవహరిస్తుంది. మీ పేమెంట్ కెపాసిటీని బయట పెడుతుంది.