ముంబై, ఏప్రిల్ 2: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం ట్రేడింగ్‌లో భారీగా పుంజుకున్నది. ఈ ఒక్కరోజే ఏకంగా 152 పైసలు కోలుకుని 93.18 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలోనైతే 188 పైసలు పెరిగింది. ఆర్బీఐ తీసుకున్న చర్యలే ఇందుకు కారణం.