ఐదు రోజులు..16 వేల కోట్లు
లాభాలతో కళకళలాడిన స్టాక్ మార్కెట్లలో పార్లమెంట్ ఎన్నికలు అలజడిని సృష్టించాయి. ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవంటూ వస్తున్న అంచనాలు సూచీల్లో పెను తుఫాన్ సృష్టించింది.
- ఈక్విటీలో పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్ఐఐలు
- స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళన
న్యూఢిల్లీ, మే 11: లాభాలతో కళకళలాడిన స్టాక్ మార్కెట్లలో పార్లమెంట్ ఎన్నికలు అలజడిని సృష్టించాయి. ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవంటూ వస్తున్న అంచనాలు సూచీల్లో పెను తుఫాన్ సృష్టించింది. గత నెలలో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీలు ప్రస్తుతం తిరోగమన బాటపట్టాయి. ఈ నెలలో జరిగిన ఎనిమిది ట్రేడింగ్ రోజుల్లో ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 2 వేల పాయింట్ల స్థాయిలో పడిపోయింది. దీంతో మదుపరుల సంపద అక్షరాల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఈ ఎన్నికల అలజడితో విదేశీ మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. గడిచిన ఐదు సెషన్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.16 వేల కోట్ల సంపదను వెనక్కి తీసుకున్నారు. ఈ ట్రెండ్
మరి కొన్ని రోజులు కొనసాగే ప్రమాదం ఉన్నదని దలాల్‌స్ట్రీట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రెండు నెలలుగా అదే తీరు వరుసగా రెండు నెలల్లో ఎఫ్ఐఐలు అమ్మకాల బటన్ నొక్కుతున్నారు. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.35,692 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ మదుపరులు.. ఇదే ట్రెండ్‌ను ప్రస్తుత నెలలోనూ కొనసాగించారు. కానీ, ఏడాది క్రితం ఇదే నెలలో రూ.44,186 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు ఎన్ఎస్ఈ నివేదిక వెల్లడించింది. మరోవైపు, ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపినప్పటికీ దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(డీఐఐఎస్) మాత్రం కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ నెలలో ఏకంగా రూ.11 వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు అమ్మకానికి గల కారణాలు
అమెరికా బాండ్ ఈల్డ్స్: అమెరికా బాండ్ ఈల్డ్స్ రేట్లను పెంచు తూ తీసుకున్న నిర్ణయం. 10 ఏండ్ల కాలపరిమితి కలిగిన బాండ్ ఈల్డ్‌పై రేటు 4.7 శాతానికి సవరించింది. దీంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వీటివైపు మళ్లించారు.
లోక్‌సభ ఎన్నికలు
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అనూహ్య రీతిలో పోలింగ్ శాతం తగ్గుతుండడంపట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో బీజేపీ సర్కార్ విజయావకాశాలు సన్నగిల్లే అవకాశం ఉండటం. అత్యధిక మంది పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడం కూడా సూచీల పతనానికి కారణం.
చైనా మార్కెట్లు
భారత్ పొరుగు దేశమైన చైనా స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగరడం కూడా ఎఫ్ఐఐలు అమ్మకాలవైపు మొగ్గుచూపారు.
- గడిచిన నెల రోజుల్లో నిఫ్టీ 1.5 శాతం పడిపోయింది. ఇదే సమయంలో షాంఘై కంపోజిట్ 2.62 శాతం అధికమవగా, హ్యాంగ్ సెంగ్ 8.8 శాతం బలపడింది.
- ఈ నెలలో జరిగిన ఏడు సెషన్లలో ఆరు రోజులు నష్టపోగా, కేవలం ఒక్క రోజు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.
- ప్రస్తుత నెలలో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు మొత్తంగా రూ.22 వేల కోట్లను ఉపసంహరించుకోగా, డీఐఐలు రూ.16,700 కోట్ల నిధులు చొప్పించారు.
ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. ఎన్నికల ఫలితాల వరకు వేచి చూసే దోరణి అవలంభిస్తుండటంతో డీఐఐలు కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
– వీకే విజయకుమార్, జియోజిట్ ఫైనాన్షియల్ ప్రెసిడెంట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

