హైదరాబాద్, మే 5: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..అమెరికా మార్కెట్లోకి గుండె కండరాల్లోని రక్త ప్రవాహాన్ని నియంత్రించే రెగాడెనోసన్ ఇంజెక్షన్‌ను విడుదల చేసింది. సింగిల్ డోస్ 0.4 ఎంజీ/5 ఎంఎల్లో ఈ ఇంజెక్షన్ లభించనున్నది.
లెక్సిస్కాన్ ఇంజెక్షన్‌కు జనరిక్ వెర్షన్‌గా విడుదలైన ఈ మందుకు అమెరికా నియంత్రణ మండలీ ఆమోదం తెలిపినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, హైదరాబాద్‌లోని బొల్లారం ఏపీఐ తయారీ కేంద్రానికి యూఎస్ఎఫ్డీఏ ఇటీవల తనిఖీ చేసి ఫామ్ 483ని జారీ చేసింది.