Elon Musk | ఎలన్‌మస్క్‌కు షాక్.. ఒక్కరోజులో 10వేల కోట్ల డాలర్లు హరీ!
Elon Musk | కొత్త కార్ల ఆవిష్కరణలో జాప్యంపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. దీంతో టెస్లా 12% షేర్లు నష్టపోయింది.

Elon Musk | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌కు భారీ షాక్ తగిలింది. కేవలం ఒక్కరోజులో టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ల డాలర్లు పడిపోయింది. దీనికి గురువారం స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్లు 12 శాతం పతనం కావడమే కారణమని సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలోనే టెస్లా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. చిప్‌ల కొరత వల్ల ఈ ఏడాది కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి తేలేమని ఎలన్ మస్క్ ప్రకటించడం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. గతేడాది భారీగా లాభాలు గడించిన సంస్థగా టెస్లా నిలిచింది.
ఉద్యోగుల కొరత ఉన్నందున కొత్త మోడల్ కార్లు తేలేకపోతున్నట్లు బుధవారం సంస్థ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఎలన్‌మస్క్ ప్రకటించారు. మోడల్ త్రీ కంటే చౌక ధరకు ఈవీ మోడల్ కార్లు తెస్తామని ఇన్వెస్టర్లు, కస్టమర్లలో ఆశలు రేపడానికి ప్రయత్నించారు. దీనికి తోడు సంస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి కృత్రిమ మేధపై దృష్టి కేంద్రీకరించడాన్ని మదుపర్లు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకానికే మొగ్గు చూపారు. దీంతో గురువారం ఒక్కరోజే టెస్లా ఎం-క్యాప్ 100 బిలియన్ల డాలర్లు పడిపోయింది. ప్రస్తుతం టెస్లా ఎం-క్యాప్ 1.2 లక్షల కోట్ల డాలర్లుగా ఉందని బ్లూంబర్గ్ కథనం చెబుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Elon Musk
- Tesla Cars
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

