Telecom Subscribers | 119 కోట్లకు పెరిగిన టెలికం సబ్స్క్రైబర్లు.. వెల్లడించిన ట్రాయ్..!
Telecom Subscribers | గతేడాది డిసెంబర్లో కొత్త మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 119 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థల సబ్స్క్రైబర్లు పెరిగారని ట్రాయ్ గురువారం తెలిపింది.
Telecom Subscribers | గతేడాది డిసెంబర్లో కొత్త మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 119 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థల సబ్స్క్రైబర్లు పెరిగారని ట్రాయ్ గురువారం తెలిపింది. బ్రాడ్ బాండ్ సబ్స్క్రైబర్ల బేస్ స్వల్పంగా పెరిగి 90.4 కోట్లకు చేరుకున్నది. మొత్తం సబ్స్క్రైబర్ల బేస్‌లో సుమారు 76 శాతం అని ట్రాయ్ తెలిపింది. నవంబర్ నుంచి డిసెంబర్ నాటికి 1,185.73 మిలియన్ల నుంచి 1,190.33 మిలియన్లకు కొత్త టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. నెలవారీగా 0.39 శాతం గ్రోత్ నమోదైందని ట్రాయ్ తెలిపింది. రిలయన్స్ జియో 39.94 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 18.5 లక్షల సబ్స్క్రైబర్లను పెంచుకున్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా 13.68 లక్షలు, కేంద్ర ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 1.5 లక్షలు, ఎంటీఎన్ఎల్ 4,420 సబ్స్క్రైబర్లను కోల్పోయాయి.
వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య డిసెంబర్లో 3.15 కోట్ల నుంచి 3.18 కోట్లకు పెరిగింది. వైర్‌లైన్ సబ్స్క్రైబర్లలో రిలయన్స్ జియో కొత్తగా 2.46 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 82,317, వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్లు 9,656, క్వాడ్రంట్ 6,926 మంది సబ్స్క్రైబర్లను పెంచుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 34,250, టాటా టెలీ సర్వీసెస్ 22,628, ఎంటీఎన్ఎల్ 11,325, ఏపీఎస్ఎఫ్ఎల్ 1,214, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 627 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయాయి. వైర్లెస్ కనెక్షన్లలో బ్రాడ్‌బాండ్ సెగ్మెంట్ స్వల్పంగా పెరిగి 85.79 కోట్ల నుంచి 86.52 కోట్లకు పెరిగింది. వైర్లెస్ బ్రాడ్ బాండ్ కనెక్షన్లు 1.46 శాతం పెరిగి 3.83 కోట్లకు పెరిగాయి. మొత్తం సబ్స్క్రైబర్లలో టాప్ 65 సర్వీస్ ప్రొవైడర్లకు 98.35 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. రిలయన్స్ జియో 470.19 మిలియన్లు, భారతీ ఎయిర్టెల్ 264.76 మిలియన్లు, వొడాఫోన్ ఐడియా 127.29 మిలియన్ డాలర్లు, బీఎస్ఎన్ఎల్ 25.12 మిలియన్, అర్టియా కన్వర్జెన్స్ 2.23 మిలియన్ల సబ్స్క్రైబర్లు కలిగి ఉన్నాయని ట్రాయ్ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

