రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కు రావాలని తమిళనాడు పారిశ్రామికవేత్తలకు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. గురువారం చెన్నైలో సీఐఐ భాగస్వామ్యంతో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు కేవలం భూములు, పెట్టుబడులతో నిర్మించలేమని, మేధస్సుతో నిర్మితమవుతాయని తమిళనాడు దేశానికి చూపించిందని కొనియాడారు.
- తమిళనాడు వ్యాపారవేత్తలకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కు రావాలని తమిళనాడు పారిశ్రామికవేత్తలకు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. గురువారం చెన్నైలో సీఐఐ భాగస్వామ్యంతో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు కేవలం భూములు, పెట్టుబడులతో నిర్మించలేమని, మేధస్సుతో నిర్మితమవుతాయని తమిళనాడు దేశానికి చూపించిందని కొనియాడారు. చిన్న తరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటివని, ఈ స్ఫూర్తితోనే తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించినట్టు తెలిపారు.
అభివృద్ధి ఫలాలు అందరికి..: భట్టి
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా వేగవంతంగా అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన ‘సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ బిజినెస్ మీట్- 2026’లో ఆయన మాట్లాడుతూ..సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

