TDS on EPF | ఈపీఎఫ్‌లో టీడీఎస్ డిడక్షన్.. అధిగమించే చిట్కాలు ఇవీ!
TDS on EPF | ఈపీఎఫ్‌వోలో సభ్యులు తమ ఖాతాల నుంచి నగదు విత్డ్రాయల్స్పై టీడీఎస్ ఎప్పుడు వసూలు చేస్తారో తెలుసుకోవాలి.
TDS on EPF | మీరు ఏ సంస్థలోనైనా ఉద్యోగం చేస్తున్నారా.. మీ వయస్సు 58 ఏండ్లకు చేరువలో ఉందా.. ? ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 ఏండ్లు. అలా రిటైర్మెంట్ అయ్యే నాటికి ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్) మెచ్యూర్ అవుతుంది. ఏ ఉద్యోగైనా రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే, ఆ రెండు నెలలు ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తంపై పన్ను రాయితీ ఉంటుంది. అయితే, ఖాతా మెచ్యూర్ కాకముందే, ఉద్యోగి తన పీఎఫ్ ఖాతా నుంచి విత్ డ్రా చేసుకుంటే, టీడీఎస్ వర్తిస్తుంది. టీడీఎస్ ఆబ్లిగేషన్ల పట్ల సబ్స్క్రైబర్లు అప్రమత్తంగా ఉండాలని ఈపీఎఫ్‌వో ట్వీట్లో నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈపీఎఫ్‌పై టీడీఎస్ ఎలాగంటే?!
టీడీఎస్ అంటే టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. వ్యక్తుల ఆదాయం ఆధారంగా పన్ను వసూళ్లకు ఏర్పాటు చేసిన వ్యవస్థే టీడీఎస్. పన్ను ఎగవేతలను తగ్గించేందుకు టీడీఎస్ వ్యవస్థను కేంద్రం వినియోగిస్తుంది. వేతనంతోపాటు వడ్డీ, కమీషన్లు, డివిడెండ్లు తదితర వివిధ రకాల రెవెన్యూపై టీడీఎస్ విధిస్తారు.
ఈపీఎఫ్‌పై టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ కాదంటే?..
ఈపీఎఫ్‌వో వెబ్సైట్ ప్రకారం ఈపీఎఫ్ నుంచి టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేయాలో, ఎప్పుడు డిడక్ట్ చేయకూడదో విధి విధానాలు ఉన్నాయి.
* ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు పీఎఫ్ నిధులు బదిలీ చేసినప్పుడు.
* అనారోగ్యంతో ఉద్యోగం నుంచి సభ్యుడి తొలగింపు
* వ్యాపారం నిలిపేయాలని యాజమాన్యం నిర్ణయించినప్పుడు
* ప్రాజెక్ట్ ముగిసినప్పుడు.
* సభ్యుడి నియంత్రణ దాటి ఇతర కారణాల వల్ల.
* ఐదేండ్ల తర్వాత పీఎఫ్ విత్ డ్రా చేసుకుంటే.
* ఐదేండ్ల లోపు సర్వీసు ఉన్నప్పుడు, రూ.50 వేలలోపు విత్‌డ్రా చేసుకుంటే.
* ఒకవేళ ఐదేండ్లకంటే తక్కువ సర్వీసు ఉంటే, రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకుంటే పాన్ కార్డుతోపాటు ఫామ్ 15జీ / 15హెచ్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ అవుతుందంటే?..
* ఐదేండ్లలోపు సర్వీసుతోనే రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే..
* పాన్‌కార్డు సబ్మిట్ చేసినా ఫామ్ 15జీ / 15 హెచ్ ఫామ్ సబ్మిట్ చేయకుంటే 10 శాతం టీడీఎస్ డిడక్ట్ చేస్తారు.
* ఒకవేళ ఉద్యోగి పాన్ కార్డు సబ్మిట్ చేయకుంటే గరిష్ఠంగా టీడీఎస్ (34.608 శాతం) డిడక్ట్ చేస్తారు.
* చెల్లింపుల టైంలో టీడీఎస్ డిడక్ట్ చేస్తారు.
* ఆదాయం పన్ను చట్టం-1961లోని 192ఏ సెక్షన్ ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేస్తారు.
* 60 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులు ఫామ్ 15హెచ్, టాక్సబుల్ ఇన్‌కం లేని వారు 15జీ ఫామ్ సబ్మిట్ చేయాలి.
* సెల్ఫ్ డిక్లరేషన్లు, ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్‌లను డూప్లికేట్‌గా ఆమోదిస్తారు.
* ఫామ్ 15జీ/ 15హెచ్, ఫామ్ 19తోపాటు సభ్యులు తప్పనిసరిగా పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- EPFO
- TDS
- Withdrawals
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

