TCS Q4 Results | అదరగొట్టిన టీసీఎస్.. మార్చి త్రైమాసికంలో 9శాతం గ్రోత్.. షేర్ పై రూ.28 ఇంటరిం డివిడెండ్ ..!
TCS Q4 Results | ఐటీ మేజర్ టీసీఎస్ (TCS) అదరగొట్టింది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో టీసీఎస్ సంఘటితన నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసింది.
TCS Q4 Results | ఐటీ మేజర్ టీసీఎస్ (TCS) అదరగొట్టింది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో టీసీఎస్ సంఘటితన నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) నాలుగో త్రైమాసికంలో రూ.12,434 కోట్ల నికర లాభం గడించింది. 2022-23తో పోలిస్తే రూ.11,392 కోట్ల నుంచి తొమ్మిది శాతానికి పైగా పెంచుకున్నది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికంతో పోలిస్తే రూ.11,058 కోట్లు కాగా, చివరి త్రైమాసికంలో 12.44 శాతం పెంచుకున్నది. ఈ నేపథ్యంలో టీసీఎస్ తన వాటాదారులకు షేర్ మీద రూ.28 చొప్పున ఇంటరిం డివిడెండ్ ప్రకటించింది.
2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.61,237 కోట్ల ఆదాయం గడించింది టీసీఎస్. 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.59,162 కోట్ల ఆదాయం సంపాదించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 3.50 శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.07 శాతం గ్రోత్ (రూ.60,583 కోట్లు) సాధించింది. ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో టీసీఎస్ షేర్ దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.4,003.80 వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

