ఏఎంటీ వేరియంట్
ధర రూ.5.99 లక్షలు
ముంబై, మార్చి 4: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ తన ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కారు ‘టియాగో’ను సరికొత్త ఆప్షన్‌తో ఎక్స్‌టీఏ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏ ఎంటీ) ఆప్షన్ కలిగిన ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరను రూ.5.99 లక్షలుగా నిర్ణయించినట్లు టాటా మోటర్స్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.