TATA-AirBus | ఎయిర్‌బస్ వ్యూహాత్మక సప్లయర్ టాటా టెక్నాలజీస్!
TATA-AirBus | ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ వ్యూహాత్మక సప్లయర్‌గా టాటా టెక్నాలజీస్ ఎంపికైంది.

TATA-AirBus | ప్రపంచ అగ్రశ్రేణి విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ వ్యూహాత్మక సప్లయర్‌గా టాటా టెక్నాలజీస్ ఎంపికైంది. టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ సంస్థ గ్లోబల్ ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీగా నిలిచింది. ఎయిర్‌బస్‌కు టాటా టెక్నాలజీస్.. ఇంజినీరింగ్, మాన్యుఫాక్చరింగ్ ఇంజినీరింగ్ అండ్ సర్వీసెస్ స్ట్రాటర్జిక్ సప్లయర్ (ఈఎంఈఎస్ 3) వ్యవహరిస్తుంది.
ఇందులో భాగంగా ఎయిర్‌బస్‌తో ఇంజినీరింగ్, కస్టమర్ సర్వీసెస్ ఇంజినీరింగ్, మాన్యుఫాక్చరింగ్ ఇంజినీరింగ్‌లో టాటా టెక్నాలజీస్ సహకరిస్తుంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య కుదిరిన మాస్టర్ సప్లయ్ అగ్రిమెంట్ (ఎంఎస్ఏ)లో భాగంగా మున్ముందు ఫ్రాన్స్‌లోని టౌలౌజ్, జర్మనీలోని హంబర్గ్, స్పెయిన్‌లోని సివిల్లే ప్రాంతాల నుంచి ఎయిర్‌బస్‌కు అన్ని రంగాల్లోనూ సేవలందించేందుకు టాటా టెక్నాలజీస్ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
ఏడు నెలల సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఎయిర్‌బస్ వ్యూహాత్మక సప్లయర్‌గా తమ సంస్థ ఎంపికైందని టాటా టెక్నాలజీస్ పేర్కొంది. ఎయిర్‌బస్ కోసం మూడు దశాబ్దాల ఇంజినీరింగ్ సేవలను అందిస్తుంది. గ్లోబల్ ఎయిర్ స్పేస్ కస్టమర్లతో కలిసి విస్తృత శ్రేణితో కూడిన వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో పని చేసిన అనుభవంతో ఎయిర్‌బస్‌కు వ్యూహాత్మక సప్లయర్‌గా పని చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Air bus
- tata technologies
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

