Tata Nexon Facelift | మార్కెట్లోకి 2023 టాటా నెక్సాన్ఈ వీ ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్స్, ధర తెలుసుకోండి
Tata Nexon Facelift | దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ గురువారం మార్కెట్లోకి 2023 నెక్సాన్, 2023 నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరించింది.
Tata Nexon Facelift | దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) మార్కెట్లోకి గురువారం 2023-టాటా నెక్సాన్, 2023-టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఈవీ (Tata Nexon EV Facelift) ఆవిష్కరించింది. టాటా నెక్సాన్ రూ.8.10 లక్షలు (ఎక్స్ షోరూమ్), టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రూ.14.74 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా మోటార్స్‌లో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నెక్సాన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల నాలుగో తేదీ నుంచే నెక్సాన్, నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. ఆసక్తిగల వారు రూ.21 వేలు పే చేసి బుక్ చేసుకోవచ్చు.
ఇవీ 2023 టాటా నెక్సాన్.. టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు
న్యూ టాటా నెక్సాన్ కారు ఎక్స్టీరియర్గా ‘టాటా కర్వ్ కాన్సెప్ట్’ రూపుదిద్దుకున్నది. రీ డిజైన్డ్ డీఆర్ఎల్స్, హెడ్ లైట్స్, ఫ్రంట్ ఫేసియా, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్ హౌసింగ్ బై-ఫంక్షనల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్రెష్ వీల్ డిజైన్ కలిగి ఉంటాయి. రేర్‌లో న్యూ బంపర్ డిజైన్ అండ్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో వస్తున్నది.
తాజా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్.. టాప్‌లో ఫుల్ విడ్త్ డీఆర్ఎల్స్‌తోపాటు స్ప్లిట్ ఎల్ఐడీ లైటింగ్ కాన్ఫిగరేషన్, బంపర్ కింద ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, స్ట్రీమ్ లైన్డ్ ఫాక్స్ గ్రిల్లె ప్యానెల్, రేర్ సైడ్ రివైజ్డ్ బంపర్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
ఇంటీరియర్‌గా టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ మోడల్స్‌లో సమూల మార్పులు చూశారు. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్ ఆపరేటెడ్ ఎఫ్ఏటీసీ ప్యానెల్, 10.26 -అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, వెంటిలేటెడ్ సీట్స్, వైర్ లెస్ చార్జింగ్, సన్ రూఫ్, రేర్ ఏసీ వెంట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ తదితర ఫీచర్లు జత చేశారు. ఎలక్ట్రిక్ వర్షన్ కారు 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటాయి.
పవర్ ట్రైన్లతో ఇంజిన్లు
నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలోనే వస్తుంది. నాలుగు ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్‌తోపాటు కొత్తగా 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ వర్షన్లలో లభిస్తాయి. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్లు గరిష్టంగా 120 హెచ్‌పీ విద్యుత్, 170 ఎన్ఎం టార్క్.. డీజిల్ వేరియంట్ 115 హెచ్‌పీ విద్యుత్, 260 ఎన్ఎం టార్క్‌ను వెలువరిస్తాయి.
టాటా నెక్సాన్ ఈవీ రెండు వేరియంట్లు – మీడియం రేంజ్ (ఎంఆర్), లాంగ్ రేంజ్ (ఎల్ఆర్) ఆప్షన్లతో వస్తుంది. మీడియం రేంజ్ ఇంజిన్ గరిష్టంగా 129 హెచ్‌పీ విద్యుత్, 215ఎన్ఎం టార్క్, లాంగ్ రేంజ్ వేరియంట్ 145 హెచ్‌పీ విద్యుత్, 215 ఎన్ఎం టార్క్‌ను వెలువరిస్తాయి.
నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ లాంగ్ రేంజ్ వేరియంట్ 8.9 సెకన్లలో 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు 150 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. రెండు వేరియంట్లు త్రీ డ్రైవింగ్ మోడ్స్ : ఎకో, సిటీ, స్పోర్ట్ ఆప్షన్లతో వస్తున్నాయి.
టాటా నెక్సాన్ ఈవీ ఎంఆర్ వేరియంట్ 30 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకప్ కలిగి ఉండటంతోపాటు సింగిల్ చార్జింగ్‌తో 325 కిమీ దూరం, ఎల్ఆర్ వేరియంట్ 40.5 కిలోవాట్ల బ్యాటర్ ప్యాకప్ తో 465 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
ఇవీ సేఫ్టీ ఫీచర్లు
అప్ డేటెడ్ నెక్సాన్, నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ కార్లు 6-ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ వ్యూ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, ఐసోఫిక్స్ సీట్ యాంకర్స్, ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ తదితర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

