Tata Nexon EV & Tiago EV | టియాగో.ఈవీ, .. నెక్సాన్.ఈవీ మోడల్స్‌పై టాటా మోటార్స్ బంపరాఫర్.. భారీగా ధరల తగ్గింపు.. !
Tata Nexon EV & Tiago EV | ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైన బ్యాటరీ సెల్స్ ధరలు స్వల్పంగా తగ్గడంతో టాటా మోటార్స్ తన టియాగో ఈవీపై రూ.70 వేలు, నెక్సాన్ ఈవీ కారుపై రూ.1.20 లక్షల వరకు ధరలు తగ్గించింది.
Tata Nexon EV & Tiago EV | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూకుడుగా దూసుకెళ్తున్న టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ కార్ల ధరలు భారీగా తగ్గించింది. టియాగో ఈవీ కారు ధర రూ.70 వేల తగ్గింపుతో రూ.7.99 లక్షల (ఎక్స్ షోరూమ్) కు లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ఎస్యూవీ కారు ధర రూ.1.20 లక్షల వరకు తగ్గించడంతో రూ.14.49 లక్షల (ఎక్స్ షోరూమ్) కు దిగి వచ్చింది. టాటా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ వర్షన్ కారు ధర రూ.16.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. టాటా నెక్సాన్ ఈవీ ఎస్యూవీ మూడు వేరియంట్లు – క్రియేటివ్, ఫియర్లెస్, ఎంపవర్డ్ వేరియంట్లలో లభిస్తుంది. మీడియం రేంజ్ వర్షన్ సింగిల్ చార్జింగ్‌తో 325 కి.మీ, లాంగ్ రేంజ్ వర్షన్ 465 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
టాటా టియాగో ఈవీ కారు నాలుగు వేరియంట్లు – ఎక్స్ఈ, ఎక్స్‌టీ, ఎక్స్ జడ్+, ఎక్స్ జడ్+ లక్స్ మోడల్స్ లో లభిస్తుంది. టాటా టియాగో మీడియం, లాంగ్ రేంజ్ వేరియంట్లలో లభిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్ సింగిల్ చార్జింగ్ సాయంతో 250 కి.మీ, లాంగ్ వేరియంట్ 315 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఎంజీ మోటార్స్ కామెట్ ఈవీ బేస్ వేరియంట్ కారు ధరతో పోలిస్తే టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్ రూ.లక్ష ఎక్కువ ధర పలుకుతుంది. ఇటీవలే ఎంజీ కామెట్ ఈవీ బేస్ వేరియంట్ ధర తగ్గించారు.
ఎలక్ట్రిక్ కార్లలో కీలకమైన బ్యాటరీ సెల్స్ ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ తన టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ మోడల్ కార్ల ధరలు తగ్గించింది. బ్యాటరీ సెల్స్ ధర తగ్గినా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన టాటా పంచ్ ఈవీ కారు ధరలో ఎటువంటి మార్పు లేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

