న్యూఢిల్లీ : టాటా మోటార్స్ నవంబర్‌లో 29,778 వాహనాల విక్రయంతో ప్రయాణీకుల వాహన విక్రయాల్లో 38 శాతం వృద్ధి కనబరిచింది. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ నవంబర్‌లో 324 శాతం వృద్ధితో 1751 వాహనాలను కంపెనీ విక్రయించింది. అంతకుముందు ఏడాది నవంబర్‌లో ఈ వాహనాల సేల్స్ 413 యూనిట్లుగా నమోదైంది.
ఇక దేశీ, అంతర్జాతీయ మార్కెట్లలో మొత్తంగా 62,192 వాహనాల అమ్మకాలు జరగ్గా, గత ఏడాది నవంబర్‌లో మొత్తం అమ్మకాలు 32,245గా నమోదయ్యాయి. వాణిజ్య వాహన విభాగంలో గత ఏడాది నవంబర్‌లో 27,982 వాహన అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది నవంబర్‌లో వాణిజ్య వాహన అమ్మకాలు 15 శాతం వృద్ధితో 32,245కి ఎగబాకాయి. మధ్యతరహా, భారీ వాణిజ్య వాహనాల విభాగం సేల్స్‌లో టాటా మోటార్స్ 10 శాతం వృద్ధి నమోదు చేసింది.