Tata Punch | న్యూఢిల్లీ, ఆగస్టు 4: స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన పంచ్‌ని సీఎన్జీ వెర్షన్లో విడుదల చేసింది టాటా మోటర్స్. ఈ కారు రూ.7.1 లక్షల నుంచి రూ.9.68 లక్షల లోపు ధరను నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
వాయిస్‌తో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను మార్చుకునే ఫీచర్ ఉన్న ఈ కారులో ఆటోమేటిక్ ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్ఎస్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో అనుసంధానమైన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీంతోపాటు టియాగో సీఎన్జీ, టైగర్ సీఎన్జీ వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్లు రూ.6.55 లక్షల నుంచి రూ.8.95 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నాయి.