Stock Market | అంతెత్తున ఎగిసి ఆపై దిగి వచ్చి.. చివరికి లాభాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) బుధవారం లాభాలతో ముగిశాయి. చమురు ధరల పతనం, ఆసియా మార్కెట్ల (Asia Markets) సానుకూల సంకేతాలతో సూచీలు ఉదయం ఉరకలేశాయి. ఆ తర్వాత అమాంతం చతికిలపడ్డాయి. చివరకు కోలుకుని లాభాలతో ముగిశాయి.
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) బుధవారం లాభాలతో ముగిశాయి. చమురు ధరల పతనం, ఆసియా మార్కెట్ల (Asia Markets) సానుకూల సంకేతాలతో సూచీలు ఉదయం ఉరకలేశాయి. ఆ తర్వాత అమాంతం చతికిలపడ్డాయి. చివరకు కోలుకుని లాభాలతో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ (Sensex) 770 పాయింట్లకుపైగా లాభపడగా, నిఫ్టీ (Nifty) 25,200 మార్క్ పైన ముగిసింది.
క్రితం సెషన్ ముగింపు (81,106.65) తో పోలిస్తే ఈ ఉదయం సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్ల లాభంతో 82,248.68 వద్ద ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 82,520 వద్ద ఎనిమిది నెలల గరిష్ఠస్థాయిని తాకింది. ఈ దశలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఐటీ, రియల్టీ షేర్లలో అమ్మకాలతో కుదేలైన సెన్సెక్స్.. 81,417 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది.
అంటే గరిష్ఠస్థాయి నుంచి దాదాపు 1000 పాయింట్లు తగ్గింది. చివరి సెషన్లో కోలుకున్న సూచీలు మార్కెట్ ముగిసే సమయానికి 772.75 పాయింట్లు పెరిగి 81,879 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 210 పాయింట్లు లాభపడి 25,255 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనిమిది పైసలు పెరిగి 93.69 గా స్థిరపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయనే అంచనాలతో ముడిచమురు ధరలు దిగొచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | అంతెత్తున ఎగిసి ఆపై దిగి వచ్చి.. చివరికి లాభాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
ఎన్ఐపీజీఆర్.. మొక్కల జన్యు నిర్మాణం, పనితీరుపై పరిశోధన చేసే సంస్థ
Sonia Gandhi | ఆ ఏడాది రాహుల్‌గాంధీ పుట్టినరోజుకు ఎవరూ రాలేదు : సోనియాగాంధీ
Pyre | ఆస్కార్ రేసులో మరో భారతీయ చిత్రం.. ఇండిపెండెంట్ రూట్లో ప్రయాణిస్తున్న ‘పైర్’!
Niranjan Reddy | వనపర్తి ఇరిగేషన్ సీఈ ఆఫీస్ ఎదుట రైతులతో నిరంజన్ రెడ్డి ధర్నా.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

