ఆర్థిక ఫలితాలు కీలకం.. పశ్చిమాసియా సంక్షోభంపైనా మదుపర్ల నజర్
దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూ.. లేస్తూ సాగుతున్నాయి. అయినప్పటికీ అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,256.94 పాయింట్లు లేదా 3.11 శాతం ఎగిసి 74,729.27 వద్ద నిలిచింది.
- మార్కెట్ పల్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూ.. లేస్తూ సాగుతున్నాయి. అయినప్పటికీ అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,256.94 పాయింట్లు లేదా 3.11 శాతం ఎగిసి 74,729.27 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 625.70 పాయింట్లు లేదా 2.77 శాతం పెరిగి 23,146.15 దగ్గర ఆగింది. ఇక ఈ వారం విషయానికొస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయ త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు కీలకం కానున్నాయి. దేశీయ ఐటీ రంగ సంస్థలు ఆశాజనక ఫలితాలను నమోదు చేస్తుండటం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తున్నది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు, నిర్ణయాలు కొంత మేర అమ్మకాల ఒత్తిడికి దారితీస్తున్నాయి.
అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో దిగొస్తున్న ముడి చమురు ధరలు, ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే బలపడుతున్న రూపాయి మారకం విలువ.. స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లకు మద్దతిచ్చే వీలుందనే చెప్పవచ్చు. కానీ పశ్చిమాసియా సంక్షోభంతో క్రూడాయిల్ రేట్లు ఇంకా పెరిగితే సూచీలు నష్టాలకు లోనుకావచ్చు. తగ్గితే మదుపర్లు పెట్టుబడులకు మొగ్గుచూపుతారు. విదేశీ మదుపర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్ నినో సంబంధిత సమాచారం కూడా మార్కెట్ కదలికల్ని ప్రభావితం చేయగలవు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం.. మార్కెట్ పెట్టుబడులను గట్టిగానే ప్రభావితం చేయగలవని చెప్పవచ్చు. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,400-23,600 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చని కూడా మెజారిటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న వివరాలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

