Stock market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 1,372 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. నిఫ్టీ 445 పాయింట్లు లాభం
Stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,372 పాయింట్లు (1.89 శాతం) పెరిగి, 74,068 వద్ద ముగిసింది.
Stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,372 పాయింట్లు (1.89 శాతం) పెరిగి, 74,068 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 445 పాయింట్లు పెరిగి 22,957.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఒక దశలో 1700 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా ఒక దశలో 23000 దాటింది. 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఇండిగో, ఎల్ అండ్ టీ, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, లాగార్డ్ భారీ లాభాలు పొందాయి.
హెచ్డీఎఫ్సీ షేర్లు 1.1 శాతం పెరిగాయి. అంతకుముందు మూడు సెషన్లలో కలిపి హెచ్డీఎఫ్సీ షేర్లు 11.7 శాతం తగ్గి, రూ 1,35,000 కోట్లు మార్కెట్ విలువ కోల్పోయింది. ఈ రోజు నిఫ్టీ స్మాల్‌క్యాప్100 0.77 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్100 1.10 శాతం పెరిగింది. ఇరాన్‌పై ఐదు రోజులపాటు దాడుల్ని నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లకు మంచి బలాన్నిచ్చింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లోనే కొనసాగడం కలిసొచ్చింది. దీంతో సోమవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు మంగళవారం లాభాలబాట పట్టాయి. ఇన్వెస్టర్ల సంపద మంగళవారం ఒక్క రోజే రూ.7 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ విలువ రూ.423 లక్షల కోట్లకు చేరింది.
నేడు ఉదయం ట్రేడింగ్ లాభాల్లోనే ప్రారంభమైంది. సోమవారం 72,696.39 వద్ద ముగిసిన సెన్సెక్స్ మంగళవారం ఉదయం 74,212.47 వద్ద లాభంతో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. మరోవైపు డాలర్‌తో రూపాయి విలువ 93.86గా ఉంది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 101 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్స్ ధర 4,430 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Dalal Street
- nifty
- Oil
- Sensex
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

