న్యూఢిల్లీ, ఆగస్టు 5: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన స్టీల్ ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో స్టీల్‌కు డిమాండ్ పడిపోవడంతో టన్ను స్టీల్ ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు తగ్గాయి.
ప్రస్తుత నెల డెలివరీకిగాను ఈ ధరలు వర్తించనున్నాయి. దీంతో టన్ను స్టీల్ ధర రూ.58 వేల నుంచి రూ.59 వేలుగా ఉన్నది. 2022లో ఇదే తక్కువ ధర కావడం విశేషం. గత నెలతో పోలిస్తే ధరలు 4 శాతం వరకు దిగొచ్చాయి. ఒక ధశలో రూ.66 వేలు పలికిన ధరలు ప్రస్తుతం 25 శాతం దిగొచ్చాయి.