SBI on Swift | రష్యాకు స్విఫ్ట్ సేవలపై ఎస్బీఐ కీలక నిర్ణయం.. అదేమిటంటే?!
SBI on Swift | రష్యాకు స్విఫ్ట్ సేవలు అందించరాదని ఎస్బీఐ నిర్ణయించింది. అమెరికా, ఈయూ నిబంధనలను తాము పాటించాల్సి ఉంటుందన్నది.
SBI on Swift | ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నా.. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ భిన్నంగా రియాక్టయినట్లు తెలుస్తున్నది. రష్యన్ బ్యాంకులకు స్విఫ్ట్ సేవలు అమలు చేయబోవడం లేదని తెలిపింది. ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాను కట్టడి చేసేందుకు రష్యా బ్యాంకులకు అమెరికా, దాని మిత్ర దేశాలు స్విఫ్ట్ సేవలను నిలిపివేశాయి.
అంతర్జాతీయ సమాజం నిర్ణయానికి అనుగుణంగా రష్యన్ బ్యాంకులు, పోర్టులు, నౌకలకు స్విఫ్ట్ సేవలు నిలిపి వేయాలని ఎస్బీఐ తన క్లయింట్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలియవచ్చింది. ఈ విషయంలో అదనపు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ లేఖలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ అంశంపై స్పందించేందుకు ఎస్బీఐ ముందుకు రాలేదు.
అంతర్జాతీయ లావాదేవీల్లో మాకు గణనీయ భాగస్వామ్యం ఉంది. అమెరికా, ఈయూ నిబంధనలకు లోబడి మేం పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, రష్యాతో భారత్‌కు వ్యాపార, రక్షణ రంగాల్లో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ బహిరంగంగా ఖండించలేదు. కానీ దౌత్య మార్గాల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి పిలుపునిచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- EU
- Russia Invansion
- sbi
- Swift
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

