Srivaru Motors | సింగిల్ చార్జ్‌పై 250 కిలోమీటర్లు.. సరికొత్త ప్రాణ ఈవీ బైకులు
తమిళనాడుకు చెందిన శ్రీవారు మోటర్స్.. గురువారం తమ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ ప్రాణ 2.0 మాడల్‌ను ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.2,55,150. సింగిల్ చార్జింగ్‌పై 150 కిలోమీటర్లదాకా ప్రయాణం చేయవచ్చు.
- ధరల శ్రేణి రూ.2.55-3.20 లక్షలు
Srivaru Motors | చెన్నై, ఆగస్టు 22: తమిళనాడుకు చెందిన శ్రీవారు మోటర్స్.. గురువారం తమ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ ప్రాణ 2.0 మాడల్‌ను ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.2,55,150. సింగిల్ చార్జింగ్‌పై 150 కిలోమీటర్లదాకా ప్రయాణం చేయవచ్చు. కాగా, ఈ సందర్భంగానే ప్రాణ ఎలైట్ బైక్‌నూ మార్కెట్‌కు పరిచయం చేసింది శ్రీవారు మోటర్స్.
చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.3,20,250గా ఉన్నది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. 2021లో ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ ప్రాణను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా ఇప్పుడు దాని అప్డేట్ వెర్షన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్‌లో ఈ సంస్థకు ప్లాంట్ ఉన్నది.
ఇక్కడ నెలకు దాదాపు 2వేల బైకులు తయారవుతాయని ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక సీఈవో మోహన్‌రాజ్ రామస్వామి తెలిపారు. 10వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నది. త్వరలో ‘ఎలైవ్’ పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్లనూ తేవాలని కంపెనీ చూస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

