HCL layoffs | సాఫ్ట్వేర్ డెవలపర్ కొలువు పోవడంతో ర్యాపిడో డ్రైవర్‌గా మారిన టెకీ
ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల వరకూ పలు కంపెనీలు ఎడాపెడా కొలువుల కోతకు తెగబడుతున్నాయి. మాస్ లేఆఫ్స్‌తో (HCL layoffs) ఉన్న ఉద్యోగం ఊడటంతో పలువురు ఇతర ఉద్యోగాలు లభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల వరకూ పలు కంపెనీలు ఎడాపెడా కొలువుల కోతకు తెగబడుతున్నాయి. మాస్ లేఆఫ్స్‌తో (HCL layoffs) ఉన్న ఉద్యోగం ఊడటంతో పలువురు ఇతర ఉద్యోగాలు లభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇటీవల హెచ్‌సీఎల్ లేఆఫ్స్‌లో వేటుకు గురైన సాఫ్ట్వేర్ డెవలపర్ శ్రీనివాస్ రాపోలు ప్రస్తుతం ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ బతుకు బండి లాగిస్తున్నారు.
హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం పోయినందుకు శ్రీనివాస్ కలత చెందడం లేదు. ఈ సర్వీస్ ద్వారా మరో మెరుగైన జాబ్‌ను పొందుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూర్ అంతటా తిరిగే అవకాశం రావడంతో పలువురితో ముచ్చటించే క్రమంలో జావా డెవలపర్ ఓపెనింగ్స్ గురించి తనకు తెలుస్తుందని చెబుతున్నారు. హెచ్‌సీఎల్‌లో కొలువు కోల్పోయిన అనంతరం ర్యాపిడో డ్రైవర్‌గా శ్రీనివాస్ కుదురుకున్నారు.
ఓ రైడ్‌లో శ్రీనివాస్‌కు మరో టెకీ లవ్నీష్ ధిర్ పరిచయం కావడంతో ఆయన ఇంజనీర్ స్టోరీని ట్విట్టర్లో షేర్ చేసి అతడికి ఏమైనా ఉద్యోగావకాశాలు సూచించాలని పోస్ట్లోలవ్నీష్ రాసుకొచ్చచారు. ఆసక్తి కలవారు రాపోలు సీవీని తీసుకుని అందుబాటులో ఉన్న జాబ్ రోల్స్ గురించి అతడికి సమాచారం అందించాలని తన ఫాలోయర్స్‌ను కోరారు. ఇది ట్వీట్ జిమ్మిక్కు కాదని, అంటూ మరో ట్వీట్లో రాపోలు శ్రీనివాస్ సీవీ లింక్‌ను షేర్ చేశారు.
Read More :
TCS Job’s Scam | టీసీఎస్‌లో వెలుగులోకి అక్రమాలు.. ఉద్యోగాల పేరిట డబ్బులు వసూల్..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

