Snapchat | 500 మంది ఉద్యోగులపై స్నాప్‌చాట్ వేటు
Snapchat | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ (SnapChat) మాతృ సంస్థ ‘స్నాప్’ (Snap) ఫ్రెష్ లేఆఫ్స్ ప్రకటించింది ( fresh round of job cuts). వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించింది.
Snapchat | ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. 2023లో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగబడ్డాయి. ఇక కొత్త ఏడాది సైతం టెకీలపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి మాసంలోనే వేల సంఖ్యలో ఉద్యోగులు కొలువులను కోల్పోయారు. తాజాగా ఈ ఏడాది రెండో మాసంలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ (SnapChat) మాతృ సంస్థ ‘స్నాప్’ (Snap) ఫ్రెష్ లేఆఫ్స్ ప్రకటించింది ( fresh round of job cuts). వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని వెల్లడించింది. కంపెనీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఫుల్‌టైమ్ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. సంస్థలో 5,367 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ తాజా నిర్ణయంతో 540 మంది ఉద్యోగులు కొలువుల్ని కోల్పోనున్నారు.
ఇక స్నాప్తోపాటు ఓక్టా ఇన్ (Okta Inc ) సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈ నెల ప్రారంభంలోనే లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిలో ఏకంగా 7 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో 400 మంది ఉద్యోగులు కొలువులు కోల్పోనున్నారు.
Also Read..
Layoffs 2024 | కొనసాగుతున్న లేఆఫ్స్ పర్వం.. కొత్త ఏడాది తొలి మాసంలో 30 వేల కోతలు
King Charles | కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ
Varun Kumar | లైంగిక ఆరోపణలు.. భారత హాకీ ప్లేయర్‌పై కేసు నమోదు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

