స్కైరూట్‌లో కాసుల పంట.. 8 ఏండ్లలో 60 రెట్లు పెరిగిన పెట్టుబడుల విలువ
ఈ నెల 18న శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం ఓ రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు.. ఓ ప్రైవేట్ సంస్థ సృష్టించిన చరిత్ర. అవును.. హైదరాబాద్ ఆధారిత స్కైరూట్ ఏరోస్పేస్ దేశీయంగా తొలిసారి రాకెట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి, భారత్‌లో ఇన్నాళ్లూ ఇస్రోకే పరిమితమైన ఈ సామర్థ్యం తమకూ ఉందని నిరూపించింది.
- గెలిచిన ఏంజెల్ ఇన్వెస్టర్ ముకేశ్ బన్సల్ నమ్మకం
- 6 ఏండ్లుగా సంస్థాగత మదుపర్లు క్యూ
- విక్రమ్-1 ప్రయోగం విజయంతో జోష్
న్యూఢిల్లీ, జూలై 22 : ఈ నెల 18న శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం ఓ రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు.. ఓ ప్రైవేట్ సంస్థ సృష్టించిన చరిత్ర. అవును.. హైదరాబాద్ ఆధారిత స్కైరూట్ ఏరోస్పేస్ దేశీయంగా తొలిసారి రాకెట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి, భారత్‌లో ఇన్నాళ్లూ ఇస్రోకే పరిమితమైన ఈ సామర్థ్యం తమకూ ఉందని నిరూపించింది. తద్వారా అంతరిక్ష రంగంలో సుదూర కలను సాకారం చేసింది. అయితే ఈ లక్ష్య సాధన వెనుక 8 ఏండ్ల శ్రమ, మరెంతో కృషితోపాటు పెట్టుబడుల అన్వేషణ కూడా దాగి ఉన్నది.
ఇదీ సంగతి..
అది 2017. ఇస్రోలో పవన్ కుమార్ చందన, నాగ భారత్ డాక సైంటిస్టులుగా పనిచేస్తున్నారు. అప్పుడే భారతీయ అంతరిక్ష కార్యకలాపాల బిల్లు ముసాయిదాను వారు చదివారు. త్వరలోనే ప్రైవేట్ కంపెనీలకూ రాకెట్లను నిర్మించి, వాటిని ప్రయోగించే అనుమతినిస్తారని గుర్తించారు. దీంతో సర్కారీ కొలువులను వీడి పెద్ద సాహసమే చేస్తూ 2018లో స్కైరూట్‌ను స్థాపించారు. హైదరాబాద్‌లో ఓ సాదాసీదా ఆఫీస్‌లోనే దీన్ని మొదలుపెట్టారు. నిజానికి ఆ సమయంలో భారతీయ స్పేస్ రంగం.. ప్రైవేట్ కంపెనీలకు ఇంకా దూరంగానే ఉన్నది. పెట్టుబడులు పెట్టేవారు దొరికేవారే కాదు.
ముకేశ్ బన్సల్ రాకతో..
ఆలోచనలున్నాయి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే తపన ఉన్నది. కానీ అందుకు కావాల్సిన పెట్టుబడే లేదు. అప్పుడే భారతీయ ఫ్యాషన్ ఈ-కామర్స్ సంస్థ మింత్రా, దేశీయ అతిపెద్ద ఫిట్నెస్ బ్రాండ్ కల్ట్‌ఫిట్ సంస్థల వ్యవస్థాపకుడు ముకేశ్ బన్సల్.. స్కైరూట్‌కు అండగా నిలిచారు. ప్రముఖ మార్కెట్ ఇంటెలిజెన్స్ వేదిక ట్రాక్సన్ వివరాల ప్రకారం దఫదఫాలుగా దాదాపు రూ.12 కోట్ల నిధులను సమకూర్చారు. పెట్టిన పెట్టుబడులపై లాభాలు వస్తాయా? అసలు సొమ్మైనా తిరిగి వస్తుందా? చివరకు రాకెట్ ప్రయోగానికి అనుమతి లభిస్తుందా? అన్న ఎన్నో ఆలోచనలు, మరెన్నో సందేహాల నడుమ స్కైరూట్ వ్యవస్థాపకులపై నమ్మకంతో బన్సల్ ముందడుగు వేశారు. ఫలితంగా ఇప్పుడు ఆ రూ.12 కోట్ల విలువ సుమారు 60 రెట్లు ఎగిసి రూ.700 కోట్లకు చేరింది.
2020లో..
2020లో ప్రైవేట్ సంస్థలకు అంతరిక్ష రంగంలోకి అధికారిక ప్రవేశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇక్కడే స్కైరూట్ దశ తిరిగింది. రాకెట్ నిర్మాణం, దాని ప్రయోగానికి అవకాశం లభించింది. ఇక అప్పట్నుంచి స్కైరూట్‌కు మదుపర్లు క్యూ కట్టారు. సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రావడంతో కంపెనీ వృద్ధిబాట పట్టింది. ఈ నేపథ్యంలోనే 2022లో స్కైరూట్.. విక్రమ్-ఎస్‌ను లాంచ్ చేసింది. అలా భారతీయ తొలి ప్రైవేట్ నిర్మిత రాకెట్‌ను ప్రయోగించి, విజయవంతంగా దాన్ని కక్ష్యలోకి పెట్టింది.
- దాదాపు రూ.10,600 కోట్ల (1.1 బిలియన్ డాలర్లు)విలువతో భారతీయ తొలి స్పేస్‌టెక్ యూనికార్న్‌గా రికార్డు సృష్టించిన స్కైరూట్.
- ఈ ఏడాది మే నెలలో సుమారు రూ.570 కోట్ల నిధులను సమీకరించిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ.
- ముకేశ్ బన్సల్‌కు స్కైరూట్‌లో ప్రస్తుతం 5.7 శాతం వాటా. దాని విలువ ఇప్పుడు రూ.600 కోట్లపైనే.
- ఇప్పటికే పలుమార్లు రూ.100 కోట్ల విలువైన షేర్లను అమ్మేసిన బన్సల్.
- పెట్టిన రూ.12 కోట్ల పెట్టుబడిపై బన్సల్‌కు దక్కింది రూ.700 కోట్లు.
- 2014లో దేశంలో ఒక్కటే స్పేస్ స్టార్టప్. ప్రస్తుతం వాటి సంఖ్య 400కు పైనే.
- ప్రస్తుతం భారతీయ స్పేస్ ఎకానమీ విలువ 8.4 బిలియన్ డాలర్లు. 2033 నాటికి దీన్ని 44 బిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే లక్ష్యం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

