SVB Collapse | ఎస్వీబీ ఉద్యోగులకు 45 రోజులకు 1.5 రెట్లు వేతనం.. జాబ్ గ్యారంటీపై నీలినీడలు?!
SVB Collapse | ఎస్వీబీ (SVB) ఉద్యోగులకు 45 రోజులకు 1.5 రెట్ల వేతనాన్ని అమెరికా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC) ఆఫర్ చేసినట్లు వార్తలొచ్చాయి.
SVB Collapse | దివాళా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందా.. వారికి అండగా నిలిచే వారెవ్వరూ.. అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. డిపాజిటర్లకు భరోసా కల్పించేందుకు ఎస్వీబీ నియంత్రణను ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ-FDIC) చేసిన ఆఫర్ ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నది. అందులో పని చేస్తున్న ఉద్యోగులకు 1.5 రెట్లు వేతనంపై 45 రోజుల ఉద్యోగం ఆఫర్ చేసింది ఎఫ్‌డీఐసీ అనే వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఎస్వీబీ సిబ్బందికి యూఎస్ ఎఫ్‌డీఐసీ (FDIC) పంపిన ఈ-మెయిల్.. రాయిటర్స్‌కు చిక్కిందని ఆ వార్తా కథనం సారాంశం. `ఎంప్లాయీస్ రిటెన్షన్` అనే పేరుతో ఉద్యోగులకు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎఫ్‌డీఐసీ ఒక ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే బ్యాంకులో ఉద్యోగులుగా ఉన్న వారికి వారాంతంలోగా కల్పించే బెనిఫిట్లు, హెల్త్‌కేర్ ఫెసిలిటీల వివరాలను ఎఫ్‌డీఐసీ వెల్లడించనున్నదని సమాచారం. ఎస్వీబీ మాజీ మాతృసంస్థ ఎస్వీబీ ఫైనాన్సియల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ బెనిఫిట్లను ఉద్యోగులకు కల్పిస్తారని తెలియ వచ్చింది. ప్రస్తుతం ఎస్వీబీ (SVB) లో 8,528 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బ్యాంకు శాఖల ఉద్యోగులు, తప్పనిసరి వర్కర్లు మినహా ఉద్యోగులందరినీ `వర్క్ ఫ్రం హోం` సేవలను కొనసాగించాలని కోరినట్లు తెలుస్తున్నది. ఈ వార్తాకథనంపై స్పందించేందుకు ఎఫ్‌డీఐసీ (FDIC) అందుబాటులోకి రాలేదు.
బ్యాంకు ఫైనాన్సియల్ హెల్త్‌పై ఆందోళనలతో డిపాజిట్లకు తమ డిపాజిట్లు విత్‌డ్రా చేసుకునేందుకు పోటెత్తడంతో ఎస్వీబీ (SVB) కుప్పకూలింది. బ్యాంకు పర్యవేక్షకులు గుడ్డిగా వ్యవహరించడంతో మార్కెట్లలో ఎస్వీబీ (SVB) మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్ల మేరకు ఆవిరై పోయింది. గతేడాది చివరి నాటికి 175.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు, 209 బిలియన్ డాలర్ల ఆస్తులతో అమెరికాలోనే 16వ అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. బ్యాంకు ఉద్యోగులు, ఆర్థికశాఖ అధికారులు పరిస్థితిని త్వరితగతిన నియంత్రించేందుకు ఎఫ్డీఐసీతో కలిసి పని చేస్తున్నారని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తెలిపారు. కాలిఫోర్నియాలోని శాంతాక్లారా ప్రధాన కార్యాలయం, ఇతర శాఖలు సోమవారం రీ ఓపెన్ చేస్తారని ఎఫ్‌డీఐసీ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

